తదుపరి చర్యలపై సమాలోచనలు

  మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్‌పై నెలకొన్న తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సమీక్షించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం దాదాపు ఏడు గంటలకు పైగా జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు సిఎం కెసిఆర్ పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నదన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరుకోవడం, ఇందులో ట్రాన్స్‌మిషన్ కేసులు 7కు చేరుకోవడంతో తక్షణం […] The post తదుపరి చర్యలపై సమాలోచనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్‌పై నెలకొన్న తాజా పరిస్థితులను ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం సమీక్షించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం దాదాపు ఏడు గంటలకు పైగా జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు సిఎం కెసిఆర్ పలు సూచనలు, సలహాలు జారీ చేశారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నదన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 45కు చేరుకోవడం, ఇందులో ట్రాన్స్‌మిషన్ కేసులు 7కు చేరుకోవడంతో తక్షణం చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రమంతా లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతున్న అంశంపై సిఎం కెసిఆర్ ఆరా తీశారు. అవసరమైతే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుని అయినా సరే మహమ్మారిని అడ్డుకోవాలని సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలు గుంపులు, గుంపులుగా గుమిగూడకుండా చూడాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఆ యన విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి చేసేందుకు స్వీయ నియంత్రణేతో సాధ్యమవుతుందన్నారు. మరోవైపు వైరస్ బారిన పడకుండా ప్రజలకు మరింత అవగాహన కలిగించే విధంగా చర్య లు తీసుకోవాలన్నారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలన్నారు. ప్రస్తుతం గాంధీ ఆ సుపత్రితో పాటు ఫివర్, చెస్ట్, వరంగల్ ఎంజిఎం వంటి ఆసుపత్రులతో పాటు మరిన్ని ప్రైవేటు ఆసుపతత్రులను కూడా కరోనా చికిత్సకోసం సిద్దంగా ఉంచాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఐసోలేషన్ వార్డులను కూడా మరిన్ని పెంచాలన్నారు. గాంధీ ఆసుపత్రి తరహాలోనే అవసరమైతే కింగ్‌కోఠి ఆసుపత్రిని కూడా కరోనా చికిత్సకు పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు.

అలాగే కరోనా అనుమానిత లక్షణాల సంఖ్య సైతం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సిసిఎంబితో పాటు అపోలో, వింటో తదితర ఆసుత్రుల్లో లాబ్‌లను సిద్దం చేయాలన్నారు. అలాగే పేద ప్రజ లు అధికంగా నివసించే బస్తీలు, మురికివాడలపై ప్రత్యేకంగా వైద్య అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధం విషయంలో మరింత ప్రాధాన్య ఇవ్వాలన్నారు. ఇం టింటికి జరుగుతున్న సర్వేలో ఏ మాత్రం కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నా…. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కొనసాగుతు న్న లాక్‌డౌన్ కారణంగా సామాన్య ప్రజలకు నిత్యవసర సరకుల పంపిణి విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు యుద్దప్రాతిపదకన చర్యలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

CM KCR Review With Officials over Lockdown, Coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తదుపరి చర్యలపై సమాలోచనలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: