విధానత్రయం

రూరల్, అర్బన్, రెవెన్యూ పాలసీలు ప్రజల రుణం తీర్చుకోడానికే కొత్త శాసన వ్యవస్థ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి రూరల్, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయడానికి రెవెన్యూ, అవినీతిని జీరో స్థాయికి తేవడానికి అర్బన్ విధానాలు – కొత్త మున్సిపల్ చట్టంపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు త్రివిధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులకు సూ చించారు. తెలంగాణ రూరల్, అర్బన్, రెవెన్యూ అనే […] The post విధానత్రయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రూరల్, అర్బన్, రెవెన్యూ పాలసీలు

ప్రజల రుణం తీర్చుకోడానికే కొత్త శాసన వ్యవస్థ

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి రూరల్, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయడానికి రెవెన్యూ, అవినీతిని జీరో స్థాయికి తేవడానికి అర్బన్ విధానాలు
– కొత్త మున్సిపల్ చట్టంపై సమీక్షలో అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్
రాష్ట్రంలో గుణాత్మక పాలన సాధించేందుకు త్రివిధానాలను అనుసరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులకు సూ చించారు. తెలంగాణ రూరల్, అర్బన్, రెవెన్యూ అనే మూడు పాలసీలను పటిష్టంగా అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో గుణాత్మక పాలన అం దించగలమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల నుండి ఉపశమనం లభించే రీతిలో రూరల్ (గ్రామీణ) వి ధానం, లంచాలు ఇచ్చే అవసరం ఎంత మాత్రం రాకుండా వుండే విధంగా రెవెన్యూ విధానం, జీరో స్థాయికి అవినీతి చేరుకునే విధంగా అర్బన్ (పట్టణ) విధానం వుండాలని సిఎం కెసిఆర్ అన్నారు. నూతంగా రూపుదిద్దుకుంటున్న కొత్త మున్సిపల్ చట్టం పురోగతి మీద, అందులో చే ర్చాల్సిన అంశాలపై, చట్టంలో ప్రజాప్రతినిధుల బాధ్యతలు ఎలా ఉండాలి? తదితర విషయాల మీద సిఎం కెసిఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో సిఎంఒ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కామారెడ్డి కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి, సిఎంఒ కార్యదర్శి స్మిత సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ అధికారి డీవీ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాధనలో స్థిరమైన ప్రయాణం చేశామన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనన తాము అనుకున్నది సాధించామన్నా రు. అలాగే అధికారంలోకి వచ్చిన తరువాత ప లు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు విజయవంతంగా అమలు చేశామని కెసిఆర్ వ్యాఖ్యానించా రు. అన్నింటికన్నా పెద్ద సమస్యలైన మంచినీటి, సాగునీటి సమస్యలను, కరెంట్ సమస్యను సైతం అధిగమించామన్నారు. ఓట్లే పరమావధి గా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ నేపధ్యంలో ఖచ్చితంగా గ్రామాల పరిస్థితి బాగుపడాలని కోరుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే పటిష్టమైన చట్టం తెచ్చామని కెసిఆర్ అన్నారు.
ప్రజల రుణం తీర్చుకునేందుకు సంకల్పించాం
కొత్త చట్టంతో ప్రస్తుతం గ్రామాల అభివృద్ధి శరవేగంగా సాగుతోందన్నారు. గ్రామాల్లో మరో మూడు నెలల్లో స్పష్టమైన మార్పు చూడబోతున్నామని కెసిఆర్ అన్నారు. టిఆర్‌ఎస్‌పై ప్రజల్లో అత్యంత విశ్వాసం ఉన్న కారణంగానే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు తమకు అఖండమైన బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి దీవించారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామన్నారు. ప్రజల రుణం తీర్చుకోవడానికే రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు తేవాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఈ క్రమంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. చేతనైనంత మార్పు తెస్తామన్నారు. ప్రతి పనికి ఎవరో ఒకరు పూనుకోవాలి కాబట్టి ఆ పనికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. ఈసారి ప్రజలు ప్రభుత్వం నుండి ఆశించేది ఉత్తమ విధానాలు, అభ్యాసాలు, ఉత్తమ విధానాలన్నారు. వీటివల్ల ప్రజలు బాగు పడాలన్నదే తన అభిమతమన్నారు, ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే, ఆ స్ఫూర్తితోనే నూతన మున్సిపల్ చట్టం రూపుదిద్దుకోవాలన్నారు. ఇది ప్రజల అవసరాలను తీర్చే విధంగా, వారి బాగోగులు చూసుకునే రీతిలో, పట్టణాల అభివృద్ధి చక్కగా జరిగే పద్ధతిలో కఠినమైన మున్సిపల్ చట్టం రావాలన్నారు. నూతన మున్సిపల్ చట్టం మీద అవగాహన కలిగించడానికి మున్సిపల్ కమిషనర్లకు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని సిఎం సంబంధిత అధికారులకు సూచించారు.

Cm Kcr Review with officials on new municipal law

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విధానత్రయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: