తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లిస్తాం: కెసిఆర్

 

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుతో దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరందడంతోపాటు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీరుతాయని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనతంరం సిఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఎపి, మహారాష్ట్రకు వెళ్లి ఇద్దరు సిఎంలను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో కొనసాగించాల్సిన సంబంధాలపై చర్చించామని, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లిస్తామని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఎపి రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబందాన్ని కొనసాగించాలని మంత్రి వర్గం నిర్ణయించిందని చెప్పారు.

భేషజాలు పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధికి సహాకరించుకుందామని ఎపి సిఎం జగన్ తనతో అన్నారని కెసిఆర్ చెప్పారు.  ప్రతీయేటా 3వేల 500 టిఎంసిల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని… తెలంగాణ, ఆంధ్రాకు కలిపి గోదావరిలో 1480 టీఎంసీలు, కృష్ణాలో 811 టీఎంసీల నీళ్ల వాటా ఉందన్నారు. రెండు నదుల మిగులు జలాలు కూడా రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చని, ఎపి సాగునీటి పారుదల అధికారులు చర్చించడానికి మన దగ్గరికి వస్తున్నారని సీఎం తెలిపారు.

CM KCR Press meet at pragathi bhavan 

The post తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి నీళ్లిస్తాం: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.