కొత్త ఇంట్లోకి సిఎం కెసిఆర్ గృహప్రవేశం

 

మెదక్: టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. సిఎం కెసిఆర్ ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కొత్త ఇంటిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మంచి రోజులు ముగుస్తున్నాయనే కారణంగా గురువారం ఉదయం సిఎం కెసిఆర్ కుటుంబసభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి సిఎం కుటుంబసభ్యులతో పాటు కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. కాగా, గృహప్రవేశం సందర్భంగా మరోసారి యాగం చేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారని, ఇందుకోసం మూడు రోజుల పాటు సిఎం అక్కడే బస చేస్తారని వార్తలు వినిపించాయి.

CM KCR New House Warming Ceremony held in Erravalli

The post కొత్త ఇంట్లోకి సిఎం కెసిఆర్ గృహప్రవేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.