నెరవేరిన జలకల

  సాగు నీటికి ఇక ఢోకా ఉండదు ప్రతి రోజు శ్రీరాం సాగర్‌కు అర టిఎంసి మిడ్ మానేరుకు మరో అర టిఎంసి బాహుబలి పంపుల ద్వారా ఎత్తిపోత ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పంట పండుతుంది మన తెలంగాణ/వరంగల్ రూరల్ ప్రతినిధి: “సాగునీ టికి ఇక ఢోకా ఉండదు, కాళేశ్వరం లింక్ 2 పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్ లో శ్రీరాంసాగర్‌కు రోజుకు అర టిఎంసి చొప్పున ఎత్తిపోయాలని నిర్ణయించాం, మరో అర […] The post నెరవేరిన జలకల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సాగు నీటికి ఇక ఢోకా ఉండదు

ప్రతి రోజు శ్రీరాం సాగర్‌కు అర టిఎంసి
మిడ్ మానేరుకు మరో అర టిఎంసి
బాహుబలి పంపుల ద్వారా ఎత్తిపోత

ఎస్‌ఆర్‌ఎస్‌పి జలాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పంట పండుతుంది

మన తెలంగాణ/వరంగల్ రూరల్ ప్రతినిధి: “సాగునీ టికి ఇక ఢోకా ఉండదు, కాళేశ్వరం లింక్ 2 పనులు ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్ లో శ్రీరాంసాగర్‌కు రోజుకు అర టిఎంసి చొప్పున ఎత్తిపోయాలని నిర్ణయించాం, మరో అర టిఎంసి నీటిని మిడ్ మానేరుకు పంపనున్నాం, ఎస్సారెస్పి జలాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలమవుతుంది అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసుకొని సాగునీటిని అందిస్తున్నామని, ఇక మీరు చేయాల్సిందల్లా ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా పనిచేయడమే అని జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేశా రు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారం గ్రామం లో బుధవారం పరకాల ఎంఎల్‌ఎ చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి దశదినకర్మకు హాజరై ముఖ్యమంత్రి కెసిఆర్ నివాళులర్పించారు. అనంతరం ఎంఎల్‌ఎ ధర్మారెడ్డి స్వగృహంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి స ంతోష్‌రావు, బండా ప్రకాష్, వరంగల్, మహబూబాబాద్ ఎంపిలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, పరకాల, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, డోర్నకల్, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్, ఎంఎల్‌ఎలు ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఆరూరి రమేష్, నరేందర్, డాక్టర్ రాజయ్య, ఎంఎల్‌సిలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బాలసాని లక్ష్మినారాయణ, బి.వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, రాష్ట్రరైతు విమోచన చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు, వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, జడ్పి చైర్మన్లతో ముఖ్యమంత్రి కెసిఆర్ గంటకుపైగా భేటీ అయ్యారు.

మీడియాను అనుమతించకుండా సాగిన ఈ భేటీలో ప్రధానంగా సాగునీరుపై ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులతో చర్చించారు. కాళేశ్వరం లింక్ 2 పనులు ప్రారంభమైతే శ్రీరాంసాగర్‌కు మంచి రోజులొస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఎస్సారెస్పి జలాలు ఏయే నియోజకవర్గాలకు అందుతాయని ఎంఎల్‌ఎలను అడిగినట్లు తెలిసింది. దీనికి నియోజకవర్గాల వారీగా ఎంఎల్‌ఎలు పరకాల, భూపాలపల్లి, పాలకుర్తి, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, వర్ధన్నపేటలో కొంత భాగానికి నీరందుతుందని ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలిసింది. శ్రీరాంసాగర్‌పై ఆధారపడ్డ 9.68 లక్షల ఎకరాల ఆయకట్టులో వరంగల్ ఉమ్మడి జిల్లా ఆయకట్టుకు కొద్దిరోజుల్లో సమృద్ధిగా సాగునీరందుతుందని ముఖ్యమంత్రి వివరించినట్లు తెలిసింది. త్వరలోనే ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులందరిని ఎల్‌ఎండికి తనతో పాటు తీసుకెళ్తానని చెప్పినట్లు తెలిసింది. పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, జడ్పి చైర్మన్లు సమన్వయంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిష్ట పెంచాలని సూచించారు. వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్, నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు వ్యక్తిగత పనుల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.

CM KCR Meeting with MLA’s on Irrigation projects

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నెరవేరిన జలకల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: