నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన

  తెలంగాణ భవన్ వద్ద సందడి… సిఎంను కలిసిన ప్రముఖులు నేడు ప్రాజెక్టుల పరిశీలన… ఏర్పాట్లు చేసిన అధికారులు మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లాకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్ వద్ద గులాబీ సందడి నెలకొంది. సిఎం కెసిఆర్‌కు మంత్రులతో పాటు పార్టీ నాయకులు, ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అధికారులు సిఎం రాకతో విస్తృత ఏర్పాట్లు […] The post నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

తెలంగాణ భవన్ వద్ద సందడి… సిఎంను కలిసిన ప్రముఖులు
నేడు ప్రాజెక్టుల పరిశీలన… ఏర్పాట్లు చేసిన అధికారులు

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి : కాళేశ్వరం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి కరీంనగర్ జిల్లాకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్ వద్ద గులాబీ సందడి నెలకొంది. సిఎం కెసిఆర్‌కు మంత్రులతో పాటు పార్టీ నాయకులు, ముఖ్య నేతలు స్వాగతం పలికారు. అధికారులు సిఎం రాకతో విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరనున్నారు. గురువారం ఉదయం 8.50 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి 9 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని హెలీఫ్యాడ్ గ్రౌండ్‌కు చేరుకొంటారు. 9.05 గంటలకు హెలిక్యాఫ్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు.

9.40 గంటలకు కాళేశ్వరం ఆలయంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10.10 కి ఆలయం నుంచి బయలుదేరి 10.15కు హెలీప్యాడ్ చేరుకొని 10.20కు బయలుదేరి 10.30కి లక్ష్మీ బ్యారేజీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు భోజనం చేసి అనంతరం 2.00 గంటలకు హెలీప్యాడ్ చేరుకొని 2.25కు తిరిగి కరీంనగర్‌కు బయలుదేరనున్నారు. 2.30కి కరీంనగర్ హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 2.40కి తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. తీగలగుట్ట పల్లికి ముఖ్యమంత్రి చేరుకున్న అనంతరం పార్టీ ముఖ్యనేతలను కలువనున్నారు. ఈ నేపథ్యంలో సహకార ఎన్నికలపై చర్చించే అవకాశం ఉంది. జరుగుతున్న అభివృద్ధి పనులపై కూడా చర్చించే అవకాశం ఉంది. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరిగి హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌కు చేరుకుంటారు.

CM KCR in Karimnagar

The post నేడు సిఎం కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: