ముహూర్తం కుదిరింది

  19న కేబినెట్ విస్తరణకు సిఎం పచ్చజెండా ఆశల పల్లకిలో పలువురు నేతలు జోరుగా రాజకీయ విశ్లేషణలు మన తెలంగాణ / మహబూబ్‌నగర్: ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న ఉదయం మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కెసిఆర్ పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మరోసారి మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం పలువురు ప్రజాప్రతినిధులు పోటీ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి మదిలో ఎవరికి చోటు దక్కుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. […]

 

19న కేబినెట్ విస్తరణకు సిఎం పచ్చజెండా

ఆశల పల్లకిలో పలువురు నేతలు
జోరుగా రాజకీయ విశ్లేషణలు

మన తెలంగాణ / మహబూబ్‌నగర్: ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న ఉదయం మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కెసిఆర్ పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మరోసారి మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం పలువురు ప్రజాప్రతినిధులు పోటీ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి మదిలో ఎవరికి చోటు దక్కుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జిల్లాలో ఈ సారి 14 అసెంబ్లీ సీట్లలో 13 స్థానాలలో టిఆర్‌ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వీరిలో వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంలు మొదటిసారిగా టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మిగతా చోట్ల రెండు సార్లు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ఉన్నారు.

వీరిలో మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్‌గౌడ్, నారాయణపేట రాజేందర్‌రెడ్డి, మక్తల్ చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జడ్చర్ల లకా్ష్మరెడ్డి, నాగర్‌కర్నూల్ మర్రి జనార్ధన్‌రెడ్డి, దేవరకద్ర ఆల వెంకటేశ్వరరెడ్డి, అచ్చంపేట గువ్వల బాల్‌రాజ్, షాద్‌నగర్ అంజయ్య యాదవ్‌లు రెండో సారి టిఆర్‌ఎస్ నుంచి విజయం సాధించారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా నుంచి జడ్చర్ల నుంచి ఎన్నికైన డాక్టర్ లకా్ష్మరెడ్డికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి లభించగా, కొల్లాపూర్ నుంచి గెలుపొంది 2018 ఎన్నికల్లో ఓటమి చెందిన జూపల్లి కృష్ణారావుకు పంచాయతీ రాజ్ మంత్రి పదవి లభించింది. ఈ సారి కేసీఆర్ కేబినేట్‌లో ఎవరికి చోటు దక్కుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 19న జరిగే కేబినేట్‌లో 8 మందితో మంత్రివర్గ విస్తరణ చేపడితే అందులో జిల్లా నుంచి మొదటి విడతలో వనపర్తి ఎమ్మెల్యే మంత్రివర్గంలో బెర్త్ ఖాయం కావొచ్చుననే వార్తలు వెలువడుతున్నాయి.

అదే విధంగా బిసి సామాజిక వర్గం నుంచి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఈ సారి భారీ మెజార్టీతో గెలుపొందడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అనుకూలంగా ఉండడంతో మొదటి విడతలోనే తనకు మంత్రి పదవి లభిస్తుందని భరోసాతో ఉన్నారు. అదే విధంగా జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి కూడా మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవిని సమర్థవంతంగా తీర్చిదిద్దడంతో పాటు ఎలాంటి వివాదాలు, ఆరోపణలు ఆయనపై లేకపోవడంతో ఈ సారి కూడా కేసీఆర్ కేబినేట్‌లో చోటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు.

అంతే కాకుండా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఉన్న లకా్ష్మరెడ్డి వివాదరహితుడిగా పేరుంది. మొదటి విడతలో ఒకరికి మించి మంత్రి పదవి లభించకపోవచ్చునని సమాచారం. ఒకవేళ 17 మందికి చోటు దక్కితే జిల్లా నుంచి ఇద్దరికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. వారిలో ఎవరన్నది తేలడం లేదు. మంత్రివర్గంలో చోటు కోసం జిల్లా నుంచి ఎక్కువ మంది పోటీ పడుతుండడంతో కేసీఆర్ మదిలో ఎవరున్నారో చెప్పడం కష్టమని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిగణలోకి తీసుకుంటే మహబూబ్‌నగర్ జిల్లా నుంచి లకా్ష్మరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డిలు పోటీలో ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారా వు మంత్రివర్గ విస్తరణ ఉండడంతో ఈ సారి కూడా నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి రెండో సారి గెలుపొందిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్‌లు సైతం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. గద్వాల జిల్లా నుంచి ఈ సారి మంత్రివర్గంలో చోటు లేకపోవచ్చునని భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శ్రీనివాస్‌గౌడ్, లకా్ష్మరెడ్డిలలో ఎవరికో ఒకరికి బెర్త్ ఖాయమనే వార్తలు వెలువడుతున్నాయి. బిసి సా మాజిక వర్గం నుంచి శ్రీనివాస్‌గౌడ్‌కు దక్కవచ్చుననే సూ చనలు ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్ని సమీక్షలు చేసినా చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో చోటు ఎవరికి ఉందన్నది చూడాలంటే 19 వరకు వేచి చూడాల్సిందే.

cm kcr green signal to cabinet expression

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: