ఉపాధి కూలీలకు కెసిఆర్ కానుక

మహబూబ్‌నగర్: రాష్ట్రంలోని ఉపాధి కూలీలకు ఎండా కాలం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ సమ్మర్ కానుకను ప్రకటించినట్లు ఉపాధి హామీ మండలి డైరెక్టర్ కోట్ల కిషోర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సర్కిలర్‌ను హైదరాబాద్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆ శాఖ కమీషనర్ నీతూచంద్ర నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సర్కిలేషన్ ప్రకారం ఉపాధి కూలీలకు గత నెల ఫిబ్రవరిలో చేసిన పనికి 20 శాతం అదనంగా, మార్చి నెలలో 25 శాతం, […]

మహబూబ్‌నగర్: రాష్ట్రంలోని ఉపాధి కూలీలకు ఎండా కాలం దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ సమ్మర్ కానుకను ప్రకటించినట్లు ఉపాధి హామీ మండలి డైరెక్టర్ కోట్ల కిషోర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన సర్కిలర్‌ను హైదరాబాద్‌లోని గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆ శాఖ కమీషనర్ నీతూచంద్ర నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సర్కిలేషన్ ప్రకారం ఉపాధి కూలీలకు గత నెల ఫిబ్రవరిలో చేసిన పనికి 20 శాతం అదనంగా, మార్చి నెలలో 25 శాతం, ఏప్రిల్, మే నెలలో 30 శాతం, జూన్ నెలలో 20 శాతం వేతనం అదనంగా చెల్లించబడుతుందని చెప్పారు.

వలసల నివారణకు, చేపట్టవలసిన చర్యలు గ్రామీణ ప్రాంతాలలోని శ్రమశక్తి సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి చేపట్టవలసిన ఉపాధి కల్పన, ఉపాధి హామీ పథకం, స్వయం శక్తి సంఘాలకు అవగాహన పెంచేందుకు త్వరలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వాటి ఫలాలపై వివరించారు.

CM KCR Gift to Employment Laborers

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: