కెసిఆర్‌కు అరుదైన అవకాశం….

 

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం ఇచ్చే విందులో కెసిఆర్ పాల్గొన్నాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 25న రాష్ట్రపతి భవన్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా కొద్ది మంది కేంద్ర మంత్రులకే రాష్ట్రపతి ఆహ్వానం అందింది. అసోం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది. 25వ తేదీ మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు.

 

CM KCR attend President Ramnath Party with Trump

The post కెసిఆర్‌కు అరుదైన అవకాశం…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.