జగన్ అక్రమాస్తుల కేసు వాయిదా

  హైదరాబాద్: ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం కేసును డిసెంబర్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 11 చారి ్జషీటులకు సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 6కి వాయిదా వేసింది. ఈ కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరు […] The post జగన్ అక్రమాస్తుల కేసు వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఎపి సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం కేసును డిసెంబర్ 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 11 చారి ్జషీటులకు సంబంధించి న్యాయస్థానం విచారణ జరిపిన తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 6కి వాయిదా వేసింది. ఈ కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఏ-2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు.

కేవలం ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ మాత్రమే హాజరయ్యారు. ఇదిలావుండగా 15 రోజుల క్రితం జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడం సాధ్యంకాదని, ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారిక పర్యటనలో బిజీగా ఉన్నందున ఆయన కోర్టుకు హాజరు కాలేరంటూ జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

CM Jagan Illegal Assets Case Postponed To December 6

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జగన్ అక్రమాస్తుల కేసు వాయిదా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: