విశ్వాస పరీక్షలో నెగ్గిన గెహ్లాట్ ప్రభుత్వం

CM Ashok Gehlot Government Won Floor Test

జైపూర్ : రాజస్థాన్ రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగి చివరకు ఓ కొలిక్కి వచ్చాయి. శుక్రవారం నిర్వహించిన విశ్వాస పరీక్షల్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నెగ్గింది. ముందుగా ఊహించినట్లుగానే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంమైన తొలిరోజునే  గెహ్లాట్ ప్రభుత్వంపై బిజెపి అవిశ్వాసం పెట్టంది. దీంతో శాసనసభలో గెహ్లాట్ సర్కార్ మెజార్టీని నిరూపించుకుంది. 200 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ కు మిత్రపక్షాలతో కలిపి 107సీట్లు బలం ఉండటంతో విశ్వాస పరీక్షలో నెగ్గింది. సభలో బిజెపికి 73సీట్లు బలం ఉంది. కాగా విశ్వాస పరీక్ష అనంతరం శాసనసభకు ఆగస్టు 21వరకు వాయిదా వేస్తున్నట్టు స్వీకర్ ప్రకటించారు. దీనిపై స్పందించిన సచిన్ పైలట్ విశ్వాస పరీక్షల్లో ప్రభుత్వం నెగ్గడం సంతోషంగా ఉందన్నారు. విశ్వాస పరీక్ష నెగ్గడంతో ఊహాగానాలకుస్వస్తి పలికినట్లయిందని చెప్పారు. రాజస్థాన్ ప్రజల ప్రయోజనాల కోసం అందరం కలిసి పనిచేస్తామని సచిన్ పైలట్ పేర్కొన్నారు.

CM Ashok Gehlot Government Won Floor Test

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విశ్వాస పరీక్షలో నెగ్గిన గెహ్లాట్ ప్రభుత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.