సరిగ్గా శుభ్రం చేస్తున్నారా..!

టెక్నాలజీ రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టు కొత్త కొత్త డివైజ్‌లు, గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడే ప్రతి వస్తువూ ఎలక్ట్రానిక్‌కి సంబంధించిందే. ఇలాంటివన్నీ రోజువారీ అవసరాలను తీరుస్తున్నాయి. మరి ఇలాంటి వస్తువులను సరిగ్గా శుభ్రం చేస్తున్నామా అంటే కొంత తెల్లముఖం వేయాల్సిందే. తక్కువ రేటుతో మార్కెట్, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేసే వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి. క్లీన్ జెల్: గాడ్జెట్స్‌ను శుభ్రం చేసుకునేందుకు టైం ఉండదంటూ చాలా మంది చెప్తుంటారు. […] The post సరిగ్గా శుభ్రం చేస్తున్నారా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టెక్నాలజీ రోజురోజుకీ వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టు కొత్త కొత్త డివైజ్‌లు, గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. మనం వాడే ప్రతి వస్తువూ ఎలక్ట్రానిక్‌కి సంబంధించిందే. ఇలాంటివన్నీ రోజువారీ అవసరాలను తీరుస్తున్నాయి. మరి ఇలాంటి వస్తువులను సరిగ్గా శుభ్రం చేస్తున్నామా అంటే కొంత తెల్లముఖం వేయాల్సిందే. తక్కువ రేటుతో మార్కెట్, ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఎలక్ట్రానిక్ వస్తువులను శుభ్రం చేసే వస్తువులు అందుబాటులో ఉంటున్నాయి.

క్లీన్ జెల్: గాడ్జెట్స్‌ను శుభ్రం చేసుకునేందుకు టైం ఉండదంటూ చాలా మంది చెప్తుంటారు. అలాంటి వాళ్ల కోసమే క్లీన్ జెల్‌ను రూపొందించారు. ఈ జెల్ డస్ట్ రిమూవర్‌గా పనిచేస్తుంది. ఈ జెల్‌ను ల్యాప్‌టాప్ కీ బోర్డుకి అప్లై చేయాలి. అప్పుడు గ్యాప్‌లో ఉన్న దుమ్ము ధూళి దానికి అతుక్కుపోతుంది. ఆ వెంటనే ఆ జెల్‌ను తొలగిస్తే చాలూ. ఈ జెల్ నల్లగా మారేవరకు ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. క్యాలికులేటర్, టీవీ రిమోట్, కూలర్ ఏసీ రెక్కలు , టీవీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లను క్లీన్ జెల్‌తో శుభ్రం చేయొచ్చు. వీటి ధర రెండొందల నుంచి నాలుగొందల మధ్య ఉంటుంది.

కరెంట్ డస్టర్: క్లీనింగ్ డస్టర్ రెగ్యులర్‌గా మార్కెట్‌లో దొరికేదే. గాడ్జెట్స్ ను శుభ్రం చేయడం కోసం కరెంట్ డస్టర్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి. బ్యాటరీ సెల్ లేదంటే చార్జింగ్ ద్వారా వీటిని ఆపరేట్ చేయొచ్చు. ఫీదర్ డస్టర్, మోటరైజ్డ్ స్పిన్నింగ్ డస్టర్ పేరుతో మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఇది డస్టర్ కిట్ రూపంలో దొరుకుతుంది. ఎలక్ట్రిక్ స్టాండ్, డిఫరెంట్ సైజులో బ్రష్‌లు, లిక్విడ్ కిట్‌లో ఉంటాయి. లిక్విడ్‌ను అప్లై చేసి తర్వాత డస్టర్‌తో క్లీన్ చేయొచ్చు. వీటి ధర కనీసం ఆరు వందల కన్నా పైనే ఉంటుంది. గాడ్జెట్స్‌తో పాటు ఇంట్లో ఫర్నీచర్‌ను కరెంట్ డస్టర్‌తో క్లీన్ చేసుకోవచ్చు.

శుభ్రతతో ఆరోగ్యం: చాలా మంది ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లను అవసరమైనప్పుడు ఉపయోగించి పక్కన పడేస్తుంటారు. అలాంటప్పుడు వాటిపై దుమ్ము ధూళితో పాటు క్రిములు కూడా చేరతాయి. దాని వల్ల ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది. రోజులో కొన్ని వందల సార్లు ఫోన్ స్క్రీన్‌ను తాకుతాం. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు దగ్గినా, తుమ్మినా ‘బ్యాక్టీరియా’, ‘వైరస్’ లు మొబైల్‌పైకి చేరతాయి. చేతులు కడుక్కోకుండానే ఏదో ఒకటి తింటాం. అలాంటప్పుడు మొబైల్‌పై పేరుకుపోయినవి కడుపులోకి వెళ్లి అనేక సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఇతరులు ఆ ఫోన్‌ను ఉపయోగించినా వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. మిగతా గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ డివైజ్‌ల విషయంలోనూ అంతే. అందుకే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గుడ్డతో తుడిస్తే సరిపోతుంది కదా! అనుకుంటారు చాలా మంది. కానీ, శుభ్రతతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం కూడా ముఖ్యం.

క్లీన్ కిట్: ఎలక్ట్రానిక్ డివైజ్‌లు కొనేటప్పుడు ఆ కంపెనీలు అదనంగా క్లీన్‌కిట్‌లను కూడా ఇస్తుంటాయి. ఇవి రెగ్యులర్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ, చాలా మంది ఆ పని చేయరు. క్లీన్ కిట్‌లు సెపరేట్‌గా మార్కెట్ లోనూ దొరుకుతాయి. లిక్విడ్, చిన్న బ్రష్, స్మూత్ క్లాత్ ఈ కిట్‌లో ఉంటాయి. వీటి ప్రారంభ ధర యాభై రూపాయల నుంచి ఉంటుంది.

అతుకుల బ్రష్: కంప్యూటర్ కీబోర్డులపై దుమ్ము ధూళి పేరుకుపోతుంది. అలాంటప్పుడు క్లాత్‌తో గానీ, బ్రష్‌తో గానీ క్లీన్ చేస్తుంటాం. అయితే కీ బోర్డు మధ్య గ్యాప్ తక్కువగా ఉండటంతో ఆ దుమ్ము సరిగ్గా పోదు. అలాంటప్పుడు ‘డిటాచబుల్ కీబోర్డు బ్రష్’ ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఈ గాడ్జెట్‌లో బ్రష్‌తో పాటు డస్ట్ ప్యాన్ వస్తుంది. క్లీన్ చేసేందుకు బ్రష్, చిన్న చాట ఆ దుమ్మును ఎత్తేందుకు ఉపయోగపడుతుంది. కీబోర్డు, కిటికీ ఫ్రేమ్స్, ప్రింటర్స్, టెలిఫోన్లు, డెస్క్‌టాప్‌లను శుభ్రపరుచుకోవచ్చు. వీటి ధర వంద నుంచి రెండు వందల రూపాయల మధ్యలో ఉంటుంది.

ఎయిర్ బ్లోయర్: కీ బోర్డులపై దుమ్ము ఎప్పటికప్పుడు పేరుకుపోతుంటుంది. ఎయిర్ బ్లోయర్‌ను ఉపయోగించి ఆ దుమ్మును బయటకు పంపించేయొచ్చు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హ్యాండ్ ( రబ్బర్ ఎయిర్ డస్ట్ బ్లోయిర్), రెండోది ఎలక్ట్రిక్ ఎయిర్ బ్లోయర్, హ్యాండ్ బ్లోయిర్‌లో రబ్బర్ బెలూన్‌ను నొక్కితే గాలి బయటికొచ్చి దుమ్ము దులిపేస్తుంది. ఎలక్ట్రిక్ బ్లోయర్ మాత్రం ఎయిర్‌ప్రెషర్ ద్వారా క్లీన్ చేస్తుంది. మాన్యువల్ బ్లోయిర్ ధర వంద నుంచి మూడొందల మధ్య ఉంటుంది. ఎలక్ట్రిక్ బ్లోయర్ రేటు ఐదొందల నుంచిపైనే ఉంటుంది.

Cleaning up properly your Gadgets

The post సరిగ్గా శుభ్రం చేస్తున్నారా..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.