ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్

CJI Office Under RTIఢిల్లీ :  సీజేఐ ఆఫీసును సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ యాక్ట్)  పరిధిలోకి తెస్తూ సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పును ఇచ్చింది.  సీజేఐ రంజన్ గొగోయ్, జస్టిస్‌లు ఎన్.వీ.రమణ, డీ.వై. చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాతో కూడిన ఐదుగురు సభ్యులు గల రాజ్యాంగ ధర్మాసనం ఈ  తీర్పును ఇచ్చింది.  సీజేఐ కార్యాలయం సమాచార హక్కుచట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడారు. పారదర్శకత లేని వ్యవస్థను ఎవరూ కోరుకోరని, పారదర్శకత పేరుతో న్యాయ వ్యవస్థ నాశనం కాకూడదని ఆయన పేర్కొన్నారు.

CJI Office Under RTI

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.