యుపి అధికారులతో సిజెఐ భేటీ

CJI-Gogoi

న్యూఢిల్లీ: అయోధ్య వివాదంపై త్వరలో తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు, శాంతి భద్రతలపై ఆయన వారితో చర్చించారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ, డిజిపి ఓం ప్రకాశ్ సింగ్‌లను సిజె ఐ తన చాంబర్‌కు పిలిపించారు. దేశంపై, దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఈ చారిత్రక తీర్పునేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న ముంద స్తు చర్యలను ఆయన ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలుస్తోంది.

అయోధ్యపై తీర్పును సుప్రీంకోర్టు ఈ నెల 15కు ముందే వెలువరించనుంది. ఈ నెల 1315 మధ్య కాలంలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అయో ధ్య సహా పలు కీలక తీర్పులను వెల్లడించనున్నారు. ఈ నెల 17న ఆయన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. అయోధ్య తీర్పు రానున్న నేపథ్యంలో యుపిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 24 గంటలు పని చేసే మాస్టర్ కంట్రోల్‌రూమ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయోధ్యకు అదనంగా 4 వేలమంది పారా మిలిటరీ బలగాలను తరలించారు. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది.

CJI Gogoi meets UP chief secretary

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post యుపి అధికారులతో సిజెఐ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.