పౌరసరఫరాలను నెంబర్ వన్ చేస్తా

  కరీంనగర్ : పౌరసరఫరాల శాఖను నెంబర్‌వన్ స్థానంలో నిలుపుతానని బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నూతనంగా మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కరీంనగర్ విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్ తొలిసారిగా మంగళవారం కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ ఉద్యమాలకు పెట్టింది పేరని, సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని బిసి సంక్షేమ, పౌర […] The post పౌరసరఫరాలను నెంబర్ వన్ చేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరీంనగర్ : పౌరసరఫరాల శాఖను నెంబర్‌వన్ స్థానంలో నిలుపుతానని బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నూతనంగా మంత్రి పదవికి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కరీంనగర్ విచ్చేసిన మంత్రి గంగుల కమలాకర్ తొలిసారిగా మంగళవారం కరీంనగర్‌లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ ఉద్యమాలకు పెట్టింది పేరని, సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండగా మరో ఇద్దరికి మంత్రి పదవులను కేటాయించడంతో పాటు మాజీ ఎంపి వినోద్‌కుమార్‌కు కేబినెట్ స్థాయి పదవి కట్టబెట్టి రాష్ట్రంలోని 19 క్యాబినెట్ స్థానాల్లో కరీంనగర్‌కే ఐదు స్థానాలు దక్కడం జిల్లాకే గర్వకారణమన్నారు.

ఐదు స్థానాలు కరీంనగర్‌కు ఇచ్చినందుకు సిఎం కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను కెసిఆర్ అభిమానిని అని, కెటిఆర్ స్ఫూర్తి తనకు ఆదర్శమన్నారు. తాను టిడిపిలో ఉన్నప్పుడు కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకే టిడిపిని వీడి ఉద్యమంలో చేరానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ లీడర్‌లా కాకుండా ఒక డిక్షనరీలా కనిపిస్తారని, మనకు తెలియని ఎన్నో విషయాలు ఆయన వద్ద నేర్చుకోవచ్చన్నారు. ఆయనో మానవతావాధి అని, తాను రెండోసారి గెలిచినప్పుడు కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించానని కానీ ఎవరికి ఎప్పుడు పదవి ఇవ్వాలో సిఎంకు తెలుసన్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులడిగినా కాదనకుండా ఇచ్చారన్నారు. 2018లో కెసిఆర్ బొమ్మతోనే గెలిచామని, కెసిఆర్‌ను చూసే ప్రజలు తమకు ఓటేసారన్నారు. ఎమ్మెల్యేగా కంటే మంత్రిగా ఉంటే ఎక్కువ పని చేయవచ్చని భావిస్తున్నానని పేర్కొన్నారు.

పార్టీ కోసం రక్తం ధారపోయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. తనలో శ్వాస ఉన్నంత వరకు టిఆర్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తానని, పార్టీ కోసం సూసైడ్ పార్టుగా ఉంటానన్నారు. ఇంతకాలం మచ్చలేకుండా బతికానని, ఇకపై కూడా అలాగే మరింత బాధ్యతగా ఉంటానన్నారు. పార్టీలోని అందరినీ కలుపుకపోయి టీం వర్క్‌తో పనిచేస్తామన్నారు. తనకు కేటాయించిన శాఖల పట్ల సంతృప్తిగా ఉందని వెనుకబడిన కులాల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. సిఎం ముఖంలో నవ్వు కనిపించేలా పనిచేస్తానన్నారు. సివిల్ సప్లై శాఖను లోపాలకు తావులేకుండా నెంబర్ వన్ స్థానంలో నిలుపుతానని, రైసు మిల్లర్లు ప్రభుత్వానికి, ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నారు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్‌దే విజయమన్నారు. తన శాఖలపై త్వరలో పూర్తిస్థాయిలో అవగాహన తెచ్చుకుంటానని, పనుల్లో నాణ్యత లోపించినా, అవినీతి పనులకు పాల్పడినా చర్యలు తప్పవని పేర్కొన్నారు.

Civil Supplies Department will be retained as number one

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పౌరసరఫరాలను నెంబర్ వన్ చేస్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: