ఆర్ జివి తీరుతో హర్ట్ అయిన ఆ సినీ రచయిత

Cine Writer Ramajogayya Sastry Hurt on Director RGVహైదరాబాద్‌ : వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీరుతో సీనియర్ సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి హర్ట్ అయ్యారట. ప్రస్తుతం వర్మ ’పవర్ స్టార్‘ పేరుతో ఓ సినిమా తీయబోతున్నారు. గతంలో తెలుగులో ఎన్నో మంచి సిినిమాలను తీసి మంచి పేరు గడించిన వర్మ ప్రస్తుతం తన తీరును మార్చుకున్నారు. దీంతో వర్మ ప్రస్తుతం తీస్తున్న సినిమాలతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. వర్మ  తీరుపై రామజోగయ్య శాస్త్రి స్పందించారు. తాను కాలేజీలో ఉన్నప్పుడు వర్మ సినిమాలు చూసి, తెలుగు ప్రజలకు ఓ మణిరత్నం ఉన్నాడనుకున్నానని, అయితే వర్మ  మాత్రం తన ఇష్టమంటూ సినిమాలు తీస్తున్నారని, పోండి సర్ మీతో కటీఫ్, మీరు రిప్లయ్ కూడా ఇవ్వనక్కరలేదంటూ రామజోగయ్య శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఇటువంటి విషయాలకు రామజోగయ్య శాస్త్రి దూరంగా ఉంటారన్న విషయం తెలిసిందే. వర్మ వైఖరిపై ఎంత బాధ కలిగిందో శాస్త్రికి, అందుకే ఇలా స్పందించారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆర్ జివి తీరుతో హర్ట్ అయిన ఆ సినీ రచయిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.