సినిమా అనే అద్భుతమైన సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

Cine Production Executive Union

 

కన్నులపండువగా తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ రథసారధుల రజతోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ‘సినీ మహోత్సవం’ పేరిట జరిగిన ఈ వేడుక సినీ తారల తళుకుబెళుకులతో ఆద్యంతం హుషారుగా కొనసాగింది. అందాలభామల డ్యాన్సులు, వినోద కార్యక్రమాలతో ఈ వేడుక ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, చినజీయర్ స్వామి, కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్, మహేష్ బాబు, కృష్ణ, రాఘవేంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, కోటా శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అశ్వనీదత్, అల్లు అరవింద్, దిల్‌రాజు, బోయపాటి శ్రీను, సాయి ధరమ్ తేజ్, సురేష్ బాబు, నీహారిక, నాగబాబు, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశీ ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, ఎం.ఎల్.కుమార్ చౌదరి, గిరిబాబు, శ్రీకాంత్, మారుతి, తనీష్, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేడుకలో అందాల భామలు పూజా హెగ్డే, కేథరిన్, అనసూయ, లావణ్య త్రిపాఠి, రుక్సార్ తమ హుషారైన డ్యాన్సులతో మైమరపించారు. అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్, రాశీ ఖన్నా పాటలు పాడి మురిపించారు. ఈ సందర్భంగా కె.రాఘవేంద్ర రావు మాట్లాడుతూ “ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. నేను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన అందరూ మేనేజర్స్‌కు థాంక్స్ తెలుపుతున్నాను”అని అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ “తెలుగు పరిశ్రమలో నేను గత 50 ఏళ్ల నుండి ఎంతో మంది మేనేజర్లను చూశాను. ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌లు భవిషత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. చిరంజీవి మాట్లాడుతూ “తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం ఇంత వైభవంగా జరగడం ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారనేది నేను చూశాను.

సినిమా ప్రారంభం నుండి విడుదలయ్యే వరకు శ్రమిస్తారు మేనేజర్లు. సినిమా అనేది అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు”అని పేర్కొన్నారు. మహేష్ బాబు మాట్లాడుతూ “ఈ ఫంక్షన్‌లో చిరంజీవిని కలవడం కొత్త ఎనర్జీనిచ్చింది. మేనేజర్లు చేసిన ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను”అని చెప్పారు. అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.సీతారామరాజు, అధ్యక్షుడు అమ్మిరాజు కాసుమిల్లి, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వర రావు, కోశాధికారి కె.సతీష్, ఉపాధ్యక్షులు డి.యోగనంద్, కుంపట్ల రాంబాబు, సంయుక్త కార్యదర్శులు సురపనేని కిషోర్, జి.నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Cine Production Executive Union Silver Jubilee Celebration

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సినిమా అనే అద్భుతమైన సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.