వేధింపులతో బతకడం కంటే చావే శరణ్యం: సిఐ మేసేజ్

నిజామాబాద్: ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకపోతున్నానని నిజామాబాద్ జిల్లా రూద్రుర్ సిఐ దామోదర్ రెడ్డి డిపార్ట్‌మెంట్ వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన ఓ మెసేజ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తన సమస్యకు ఆత్మహత్యే మార్గమని భావిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ‘మంచి తనానికి, మానవత్వానికి ప్రతి రూపమయిన మహేందర్ రెడ్డి (డిజిపి) గారి సారధ్యములో నడుస్తున్న పోలీసు వ్యవస్థలో కూడా 30 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేసినా తనకు బలిదానం తప్పదేమోనని, బలహీన క్షణాలు నన్ను కబళిస్తాయేమో అని భయంగా ఉందన్నారు. […] The post వేధింపులతో బతకడం కంటే చావే శరణ్యం: సిఐ మేసేజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిజామాబాద్: ఉన్నతాధికారుల వేధింపులు భరించలేకపోతున్నానని నిజామాబాద్ జిల్లా రూద్రుర్ సిఐ దామోదర్ రెడ్డి డిపార్ట్‌మెంట్ వాట్సప్ గ్రూప్‌లో పెట్టిన ఓ మెసేజ్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తన సమస్యకు ఆత్మహత్యే మార్గమని భావిస్తున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. ‘మంచి తనానికి, మానవత్వానికి ప్రతి రూపమయిన మహేందర్ రెడ్డి (డిజిపి) గారి సారధ్యములో నడుస్తున్న పోలీసు వ్యవస్థలో కూడా 30 ఏళ్లుగా పోలీసు శాఖలో పనిచేసినా తనకు బలిదానం తప్పదేమోనని, బలహీన క్షణాలు నన్ను కబళిస్తాయేమో అని భయంగా ఉందన్నారు. ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక బలిదానాలు తప్పవేమోనని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ప్రతి క్షణం వేధింపులతో బతకడం కంటే  ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిదని, తన చావుతోనైనా కొందరు అధికారులు కళ్లు తెరిస్తే తన జన్మకు అర్ధం ఉంటుందని, మీ అందరి శ్రేయోభిలాషి, దామోదర్ రెడ్డి.’ అంటూ వాట్సప్ గ్రూప్‌లో పెట్టారు. ఈ మెసేజ్ చూసిన అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. సిఐ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని తెగ కంగారు పడ్డారు. చివరకు ఆయన్ను పట్టుకుని క్షేమంగా ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఓ ఎస్కార్ట్‌ను ఇచ్చి ఇంటికి పంపించారు. కొన్ని రోజులు సెలవు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దామోదర్ రెడ్డి సెలవులో ఉన్నారు.

CI Damodar Reddy WhatsApp Message goes Viral

The post వేధింపులతో బతకడం కంటే చావే శరణ్యం: సిఐ మేసేజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: