ధన్యవాదాలంటూ.. దండిగా దండుకున్నాడు…

  హసన్‌పర్తి : ధన్యవాదాలంటూ.. దండిగా దండుకున్నాడు.. వరంగల్ అర్భన్ జిల్లా హసన్‌పర్తిలోని  ఓ మాజీ  సిఐ. హసన్‌పర్తిలో కోట్లు కొల్లగొట్టిన కోటీశ్వరుడు. ఇప్పుడు కె.యు పోలీస్‌స్టేషన్  కుర్చీపై సిఐ కన్ను. ఫిర్యాదులు వస్తే సెటిల్‌మెంటే పరిష్కారం. పోలీస్‌స్టేషన్‌కు ఏ ఫిర్యాదు వచ్చినా ఫిర్యాదు దారులకు రెండు చేతుల దండం పెట్టి సెటిల్‌మెంటే పరిష్కారం అంటాడు. ఇద్దరి వద్ద డబ్బులు దండుకొని ఇంటికి పంపిస్తాడు. ఇదే పద్ధతిలో కేసులు నమోదు చేయకుండా సెటిల్‌మెంట్‌లు చేసి రెండేళ్లలోనే రూ.లక్షలు […] The post ధన్యవాదాలంటూ.. దండిగా దండుకున్నాడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హసన్‌పర్తి : ధన్యవాదాలంటూ.. దండిగా దండుకున్నాడు.. వరంగల్ అర్భన్ జిల్లా హసన్‌పర్తిలోని  ఓ మాజీ  సిఐ. హసన్‌పర్తిలో కోట్లు కొల్లగొట్టిన కోటీశ్వరుడు. ఇప్పుడు కె.యు పోలీస్‌స్టేషన్  కుర్చీపై సిఐ కన్ను. ఫిర్యాదులు వస్తే సెటిల్‌మెంటే పరిష్కారం. పోలీస్‌స్టేషన్‌కు ఏ ఫిర్యాదు వచ్చినా ఫిర్యాదు దారులకు రెండు చేతుల దండం పెట్టి సెటిల్‌మెంటే పరిష్కారం అంటాడు. ఇద్దరి వద్ద డబ్బులు దండుకొని ఇంటికి పంపిస్తాడు. ఇదే పద్ధతిలో కేసులు నమోదు చేయకుండా సెటిల్‌మెంట్‌లు చేసి రెండేళ్లలోనే రూ.లక్షలు దండుకున్నాడు.

ఆ తరువాత స్పెషల్ బ్రాంచి విభాగానికి బదిలీ కావడంతో సెటిల్‌మెంట్‌కు అవకాశం లేకపోయింది. దీంతో కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్ కుర్చీ ఖాళీ కావడంతో దానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసి స్పెషల్ బ్రాంచి విభాగానికి పోయిన ఓ సిఐ వ్యవహారం..

హసన్‌పర్తిలో పనిచేసిన కాలంలో..

2017 సంవత్సరంలో 407 కేసులు నమోదు కాగా 2018లో వంద కేసులు నమోదయ్యాయి. ఇందులో 48 కేసులను ఫాల్స్ చేసి సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా దొంగతనాలు 2017లో 6, హత్యలు-01, దొంగతనాలు-01, ప్రమాదాలు-01 2018లో మర్డర్-01 ఈవిధంగా పనిచేసి మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సెటిల్‌మెంట్ పేర్లతో దండిగా దండుకున్నాడు.

మండలంలోని జయగిరి గ్రామ శివారులో క్రషర్ యజమానుల వద్ద నుండి మాముళ్ల పేరుతో ప్రతినెల రూ.లక్షలు వసూలు చేయడం ఇసుక డంప్ యజమానుల వద్ద, బడా కాంట్రాక్టర్ల వద్ద మండలంలోని వివిధ గ్రామాల బెల్ట్‌షాపుల నుండి భారీగా వసూళ్లకు పాల్పడ్డాడని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ మాజీ సిఐ 2016 మే 2018 వరకు హసన్‌పర్తిలో విధులు నిర్వహించి అతి తక్కువ సమయంలోనే కోట్లకు పడగెత్తాడు. ఇంతేకాకుండా పోలీస్‌స్టేషన్ ఏ ఫిర్యాదు వచ్చినా సెటిల్‌మెంట్ పేరుతో ఫిర్యాదు దారుల జేబు చిల్లు పడేశెవాడని మండలంలోని జయగిరి గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎర్రగుట్ట గుట్ట ప్రాంతంలో విలువైన ప్లాట్లను బిల్డర్స్‌ను బెదిరించి ప్లాట్లు విక్రయించాడని, ఎన్‌జిఒస్ కాలనీలో బినామీ పేర్లతో ప్లాట్లు కొనుగోలు చేశాడని, జనగాం జిల్లాలో రఘునాథ్‌పల్లి మండలంలో కుటుంబసభ్యుల పేర్ల మీద, బినామీల పేర్ల మీద ఏడు ప్లాట్లను కొనుగోలు చేశాడని, ఖమ్మం జిల్లా 20 ఎకరాల మామిడితోట ఉందని, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో షాపింగ్ కాంప్లెక్స్ ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది చాలక ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ ఇన్స్‌పెక్టర్ సీటుపై కన్ను పడింది. ఉన్నతాధికారులు మరి ఏం చేస్తారో వేచి చూడాలి..

జిల్లా పోలీస్ బాస్‌లను తప్పుదోవ పట్టిస్తూ..
వరంగల్ అర్బన్ జిల్లా పోలీస్‌ల వద్ద పనిచేస్తూ తన తప్పులు ఎక్కడ బయటపడుతాయోనని వారిని తప్పుదోవ పట్టిస్తూ చాపకింద నీరులా తోటి అధికారుల పోస్టింగ్‌కు ఎసరు పెడుతున్నాడని పోలీసులు సైతం అనుకుంటున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను ప్రజాప్రతినిధులకు అప్పులిచ్చి ఇప్పుడు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికైనా ఎసిబి అధికారులు, ఇంటలెజిన్స్ అధికారులు ఓ సిఐ ఆదాయ, వయ్యాలపై ఆరా తీసి చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. నీతినిజాయితీగా పనిచేసే పోలీస్‌శాఖ గౌరవాన్ని పెంచే వారిగా ఉండే అధికారులను కెయు పిఎస్ ఇన్స్‌పెక్టర్‌గా పంపించాలని 54, 55, 57, 58 డివిజన్ల ప్రజలు కోరుతున్నారు.

CI Corruption in Hasanparthy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ధన్యవాదాలంటూ.. దండిగా దండుకున్నాడు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: