చోకర్‌తో మరింత ప్రత్యేకం!

  పండుగ వేళల్లో అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు అమ్మాయిలు. ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల వెరైటీ నగలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చోకర్‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. మెడను హత్తుకున్నట్లు ఉండే ఈ చోకర్ అందాన్ని ఎంతని చెప్పాలి. ఆధునికంగా, సంప్రదాయం గాను కనిపించేలా డిజైన్ చేస్తున్నారు వీటిని డిజైనర్లు. డ్రెస్, చీర ఎలాంటివాటిపైన అయినా చక్కగా నప్పుతుంది చోకర్. పెండెంట్, స్టడ్స్, కుందన్, డైమండ్స్, ఇతర జాతిరాళ్లు ఏవైనా చోకర్ నగకు సూటవుతాయి. మెడకు పట్టినట్టుగా […] The post చోకర్‌తో మరింత ప్రత్యేకం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పండుగ వేళల్లో అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు అమ్మాయిలు. ఇప్పుడు మార్కెట్‌లో రకరకాల వెరైటీ నగలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో చోకర్‌కే ఎక్కువ డిమాండ్ ఉంది. మెడను హత్తుకున్నట్లు ఉండే ఈ చోకర్ అందాన్ని ఎంతని చెప్పాలి. ఆధునికంగా, సంప్రదాయం గాను కనిపించేలా డిజైన్ చేస్తున్నారు వీటిని డిజైనర్లు. డ్రెస్, చీర ఎలాంటివాటిపైన అయినా చక్కగా నప్పుతుంది చోకర్. పెండెంట్, స్టడ్స్, కుందన్, డైమండ్స్, ఇతర జాతిరాళ్లు ఏవైనా చోకర్ నగకు సూటవుతాయి. మెడకు పట్టినట్టుగా ఉంటుంది కాబట్టి మెడ పొడవుగా కనిపించాలనుకునేవాళ్లు ఈ నగను ఎంచుకోవాలని చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.

మెడలో పొడవాటి హారాలతోపాటు చోకర్‌ను కూడా అలంకరించుకుంటే పండగలు, శుభకార్యాల్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. స్టయిల్‌గా కనిపించాలనుకుంటే మిగతా నగలేవీ లేకుండా చోకర్ మాత్రమే ధరించాలి. గౌన్లు, ఫ్రాక్‌లు, చీరలు… ఇలా ఎలాంటి డ్రస్‌కైనా చోకర్‌లు నప్పుతాయి. మెడ చుట్టుకొలతకు రెండు అంగుళాలు ఎక్కువ పొడవున్న చోకర్ కొనాలి. ఇలా అయితేనే సమమైన పొడవుతో, సౌకర్యవంతంగా ఉంటుంది.

Choker that enhances Neck Beauty

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చోకర్‌తో మరింత ప్రత్యేకం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: