కొరటాలతో మూవీ ఉగాది కానుకగా?

Chiranjeevi

 

ఇంకా చిరంజీవి ‘సైరా’ విడుదల తేదీనే అధికారికంగా ప్రకటించలేదు అప్పుడే ఈ మెగాస్టార్ నెక్స్ చేయబోయే కొరటాల శివ సినిమాకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిరు కోసం గత ఏడాదికి పైగా ఎదురు చూస్తున్న శివ ఇప్పుడు ‘సైరా’ నిర్మాణం పూర్తి కావడంతో ఎప్పుడెప్పుడు రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. త్వరలో హీరోయిన్లు ఫైనల్ అవుతారు. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేసి 2020 ఉగాది కానుకగా ఇవ్వాలని చిరంజీవి, రామ్‌చరణ్‌లు చూచాయగా ఒక నిర్ణయానికి వచ్చారట. ఇది నిజంగా షాక్ ఇచ్చే విషయమే. అప్పటికి ‘సైరా’ వచ్చి ఆరు నెలలే అయి ఉంటుంది.

ఇంత తక్కువ గ్యాప్‌లో చిరు రెండు సినిమాలు రావడం కన్నా అభిమానులు కావాల్సింది ఏముంటుంది. అయితే ఇది ఎంత వేగంగా షూటింగ్ పూర్తి చేస్తారు? అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ మూవీ రిలీజ్ డేట్‌ని మార్చ్ 25గా నిర్ణయించుకొని సినిమాను మొదలుపెడతారట. డెడ్ లైన్ ఉంటే వేగంగా పనులు సాగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అధికారిక ప్రకటన వచ్చే దాకా ఏదీ నమ్మలేం కానీ ఇచ్చిన సమయంలో సినిమాను పూర్తిచేసే సామర్ధ్యం కొరటాల శివ దగ్గర ఉంది. మహేష్ ‘భరత్ అనే నేను’కి సైతం ఇలాంటి వత్తిడి ఎదురైనప్పుడు తట్టుకుని మరీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అనుకున్న సమయానికి చిరంజీవి సినిమాను కొరటాల శివ పూర్తి చేసే అవశాలున్నాయి.

Chiru-Koratala Movie Release Date March 25th

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కొరటాలతో మూవీ ఉగాది కానుకగా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.