హోమ్ టైమ్.. మామ్ టైమ్

ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్‌మీడియాలోని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఖాతాను ప్రారంభించారు. మొదటి రోజు ట్విట్టర్‌లో చిరంజీవి నాలుగు ట్వీట్స్ చేశారు. మొదటగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి ఆ తర్వాత కరోనాతో జాగ్రత్తగా ఉండాలి…ఇంటికే పరిమితం కావాలనే సందేశాన్ని ఇస్తూ రెండవ ట్వీట్ చేశారు. ఇక మూడవ ట్వీట్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ మోషన్ పోస్టర్ గురించి చేశారు. ఇప్పుడే ‘ఆర్‌ఆర్‌ఆర్’ మోషన్ పోస్టర్ చూశా ను… కన్నుల పండుగగా ఉందంటూ రాజమౌళి, ఎన్టీఆర్,రామ్‌చరణ్‌లను అభినందించారు. […] The post హోమ్ టైమ్.. మామ్ టైమ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్‌మీడియాలోని ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఖాతాను ప్రారంభించారు. మొదటి రోజు ట్విట్టర్‌లో చిరంజీవి నాలుగు ట్వీట్స్ చేశారు. మొదటగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన చిరంజీవి ఆ తర్వాత కరోనాతో జాగ్రత్తగా ఉండాలి…ఇంటికే పరిమితం కావాలనే సందేశాన్ని ఇస్తూ రెండవ ట్వీట్ చేశారు. ఇక మూడవ ట్వీట్‌ను ‘ఆర్‌ఆర్‌ఆర్’ మోషన్ పోస్టర్ గురించి చేశారు. ఇప్పుడే ‘ఆర్‌ఆర్‌ఆర్’ మోషన్ పోస్టర్ చూశా ను… కన్నుల పండుగగా ఉందంటూ రాజమౌళి, ఎన్టీఆర్,రామ్‌చరణ్‌లను అభినందించారు.

ఇక నాలుగవ ట్వీట్‌గా తన తల్లి అంజనా దేవితో దిగిన ఫొటోను షేర్ చేసి ‘హోమ్ టైమ్.. మామ్ టైమ్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ సమయంలో పెద్దలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటూ చిరంజీవి సూచించారు. ఇక మొదటి రోజు మెగాస్టార్ ఫాలోవర్స్ సంఖ్య లక్షన్నర దాటింది. మొదటి రోజు ఆయన ట్వీట్స్ కు భారీగా లైక్స్, కామెంట్స్, రీ ట్వీట్స్ వచ్చాయి. ఇవే కాకుండా చిరంజీవిని ట్విట్టర్‌లోకి ఆహ్వానిస్తూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నాగార్జున, సుహాసిని, రాధికలు ట్వీట్స్ చేయగా… వారికి చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమౌళి కూడా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవిని ట్విట్టర్ లోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేయగా దానికి రీ ట్వీట్ చేసిన చిరు కృతజ్ఞతలు చెప్పారు.

Chiranjeevi spends time with his mother amid coronavirus

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హోమ్ టైమ్.. మామ్ టైమ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: