’ఆచార్య‘లో చిరు ద్విపాత్రాభినయం…?

Chiranjeevi Playing Dual Role in Acharya Movieహైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ’ఆచార్య‘. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్లాష్ బ్యాక్ లో చిరు రెండు పాత్రల్లో నటించనున్నట్టు ఆ వార్తల సారాంశం. ఈ సినిమాలో చిరు తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా, చిరుకు జోడీగా కాజల్ నటించనుంది. అయితే రామ్ చరణ్ కు జోడీగా ఎవరు నటిస్తారో ఇంకా సినిమా యూనిట్ నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉండగా ’ఆచార్య‘ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత సినిమా షూటింగ్ ను ప్రారంభించాలన్న ఆలోచనలో చిరు, కొరటాల శివ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ’ఆచార్య‘లో చిరు ద్విపాత్రాభినయం…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.