ఆ యంగ్ డైరెక్టర్‌తో మూవీ

Chiranjeevi next project with Director Babi?

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం తర్వాత మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్‌లో నటించాలనుకున్నాడు. సుజీత్‌కు ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యతలు అప్పగిస్తే ఆయన స్క్రిప్ట్ విషయంలో నిరాశ పర్చాడట. దీంతో ఈ సినిమాకు ముందు బాబీ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టాలని చిరు భావిస్తున్నాడంటూ టాక్ వినిపిస్త్తోంది. ఈ నెలలో చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఆచార్య’ ఫస్ట్ లుక్‌తో పాటు బాబీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా రాబోతుందని తెలిసింది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రామ్ చరణ్ ఆయన సినిమాలను నిర్మిస్తున్నాడు. ఖైదీ నంబర్ 150, సైరా, ఆచార్య అన్ని కూడా చరణ్ నిర్మాతగానే తెరకెక్కాయి. అయితే ఈసారి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ వారు చిరు, బాబీల కాంబో మూవీని నిర్మించబోతున్నారట. ఈ సినిమా అధికారిక ప్రకటన చిరు బర్త్ డే సందర్భంగా వచ్చే అవకాశం ఉంది.

Chiranjeevi next project with Director Babi?

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆ యంగ్ డైరెక్టర్‌తో మూవీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.