గాత్రామృతం

  సినిమా హిట్టవ్వాలంటే అన్ని పాళ్లు సరిగ్గా కుదరాలి. ముఖ్యంగా హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుందంటే అందులో ముఖ్య పాత్ర డబ్బింగ్ ఆర్టిస్‌కి చెందుతుంది. ఈమధ్య పక్క రాష్ట్రానికి చెందిన నటీమణులు తమన్నా, ఛార్మి, నిత్యామీనన్‌లాంటి వారు తమ పాత్రకుతామే డబ్బింగ్ చెప్పుంటారు. ఇతరులకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోజారమణి, సరిత, ఎస్.పి.శైలజ, సునీతా ఉపద్రష్టలాంటివాళ్లు ఎంతో మందికి గాత్రదానం చేసి పేరు తెచ్చుకున్నారు. జ్యోతిక, భూమిక, ఛార్మి, లైలా, మీరాజాస్మిన్, సౌందర్య, సోనాలిబింద్రే, శ్రేయ, జెనీలియా, […] The post గాత్రామృతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సినిమా హిట్టవ్వాలంటే అన్ని పాళ్లు సరిగ్గా కుదరాలి. ముఖ్యంగా హీరోయిన్ గుర్తింపు తెచ్చుకుందంటే అందులో ముఖ్య పాత్ర డబ్బింగ్ ఆర్టిస్‌కి చెందుతుంది. ఈమధ్య పక్క రాష్ట్రానికి చెందిన నటీమణులు తమన్నా, ఛార్మి, నిత్యామీనన్‌లాంటి వారు తమ పాత్రకుతామే డబ్బింగ్ చెప్పుంటారు. ఇతరులకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోజారమణి, సరిత, ఎస్.పి.శైలజ, సునీతా ఉపద్రష్టలాంటివాళ్లు ఎంతో మందికి గాత్రదానం చేసి పేరు తెచ్చుకున్నారు. జ్యోతిక, భూమిక, ఛార్మి, లైలా, మీరాజాస్మిన్, సౌందర్య, సోనాలిబింద్రే, శ్రేయ, జెనీలియా, సదా, స్నేహ, కత్రినాకైఫ్, తమన్నా, కమలినీముఖర్జీ, నయనతార లాంటి నాయికలకు గాత్ర దానం చేసింది సునీత.

* సమంత, లావణ్యతిపాఠీ, పూజాహెగ్డే, సమీరా రెడ్డిలకు చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెబుతోంది. బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్టుగా ‘ఏంమాయ చేసావే’కి నంది అవార్డు గెలుచుకుంది.
* సౌమ్యా శర్మ గాత్ర ధారిణి
అమలాపాల్, అనుష్కా, భావన, కాజల్‌లకు డబ్బింగ్ చెబుతోంది. ‘మహాత్మా, లక్షం’ సినిమాలకు నంది అవార్డు పొందింది.
* ఇలియానా, మాధవీలతలకు హరిత గాత్ర దానం చేసింది. ‘నచ్చావులే’
సినిమాకు నంది గెలుచుకుంది.
* రేడియో సిటీలో ఆర్‌జేగా పనిచేసిన ప్రియాంక తమన్నా , తాప్సీలకు డబ్బింగ్ చెప్పింది.
* మాధవి, సౌందర్య, రమకృష్ణ, నగ్మా, విజయశాంతిలకు గాత్ర దానం చేసిన సరిత ‘మా ఆయన బంగారం, అంతఃపురం’ సినిమాకు నంది గెలుచుకుంది.
* మాలవికా నాయర్, రాశీఖన్నా,
ఆర్తీఅగర్వాల్, భూమికచావ్లా, శ్రేయ, జెనీలియా, త్రిష ఇలా అందరి హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతోంది సవితా రెడ్డి. ‘మిస్సమ్మ, నువ్వునాకు నచ్చావ్, బొమ్మరిల్లు’ సినిమాలకు నంది అవార్డు వచ్చింది.
* శిల్పా సౌందర్యలాంటి టాప్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది.‘విజయ రామ రాజు’
సినిమాకు నంది వచ్చింది.
* కలర్స్ స్వాతి జల్సాలో
ఇలియానాకు డబ్బింగ్ చెపి ఆకట్టుకుంది.
* శావణ భార్గవి శృతిహాసన్‌కు గబ్బర్‌సింగ్‌లో చెప్పింది.
* రోజా రమణి
సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా,విజయ శాంతి, శిల్పాశెట్టి, దివ్య భారతి, నగ్మా, ఖుష్బులకు డబ్బింగ్ చెప్పింది. * వీణా ఘంటసాల బిందు మాధవి, జెనీలియా, కంగనారౌనత్, ఆదాశర్మలకు చెప్పింది.
* ఎస్‌పి శైలజ
తబు, సోనాలిబింద్రే లకు చెప్పింది.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గాత్రామృతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.