చైనా మార్కెట్‌పై సన్ ఫార్మా కన్ను

  న్యూఢిల్లీ: చైనా ఔషధ రంగ మార్కెట్‌పై దేశీయ ఔషధ దిగ్గజం సన్ ఫార్మా దృష్టిపెట్టింది. అక్కడ మెజార్టీ మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. చైనా ప్రభుత్వం ఔషధాల ధరల తగ్గింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు చైనాలో ఒక వ్యాపార భాగస్వామి కోసం సన్‌ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది. ఇది కంపెనీకి మంచి అవకాశమని, ఇప్పటి వరకు దేశ మార్కెట్లో పెద్దగా అవకాశాలు లేని చోట ఇప్పుడు సరికొత్త ఆదాయ […] The post చైనా మార్కెట్‌పై సన్ ఫార్మా కన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: చైనా ఔషధ రంగ మార్కెట్‌పై దేశీయ ఔషధ దిగ్గజం సన్ ఫార్మా దృష్టిపెట్టింది. అక్కడ మెజార్టీ మార్కెట్ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. చైనా ప్రభుత్వం ఔషధాల ధరల తగ్గింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు చైనాలో ఒక వ్యాపార భాగస్వామి కోసం సన్‌ఫార్మా ప్రయత్నాలు చేస్తోంది. ఇది కంపెనీకి మంచి అవకాశమని, ఇప్పటి వరకు దేశ మార్కెట్లో పెద్దగా అవకాశాలు లేని చోట ఇప్పుడు సరికొత్త ఆదాయ వనరులు రానున్నాయని ఒక వార్తా సంస్థ ఇంటర్వూలో సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి అన్నారు. చైనా ప్రభుత్వం మల్టీసిటీ బల్క్ ప్రొక్యూర్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టించేందుకు భారత్ వంటి దేశాలకు చెందిన కంపెనీలకు కూడా అవకాశాలను ఇస్తున్నారు. కొత్త ఔషధాలకు తొందరగా అనుమతులు ఇవ్వడం, దిగమతులను పెంచడం వంటివి చేస్తున్నారు. దాదాపు 160 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఔషధ రంగం భారతీయ కంపెనీల కోసం పలు అవకాశాలను కల్పించింది. చైనా పరిస్థితులు తమకు పెద్ద అవకాశమని, దీంతో రెవెన్యూ పెరగనుందని సంఘ్వీ అన్నారు. వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో భారత్ ఔషధ దిగ్గజం చైనాలో అడుగుపెట్టే అవకాశముందని ఆయన అన్నారు.

Chinese government is trying hard to reduce price of drugs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చైనా మార్కెట్‌పై సన్ ఫార్మా కన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: