క్లోనింగ్ పిల్లి.. ఖరీదు తేలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Copy-catబీజింగ్: జంతువుల క్లోనింగ్‌కు ఖ్యాతి గడించిన చైనాకు చెందిన ఓ సంస్థ తొలిసారిగా క్లోన్ చేసిన పిల్లిని విజయవంతంగా తయారు చేసింది. క్లోనింగ్ సాంకేతికత ద్వారా జూలై 21తేదీన పుట్టిన ఈ పిల్లికి గార్లిక్ అని పేరు పెట్టారు. ఈ పిల్లిని సృష్టించడానికి సూమారు రూ.38 లక్షలు ఖర్చు అయిందని సంస్థ తెలిపింది. చైనాకు చెందిన హుయాంగ్ యూ పెంపుడు పిల్లి చనిపోవడంతో, కృత్రిమంగా పిల్లిని ఉత్పత్తి చేయాలని సీనోజీన్ సంస్థను కోరాడు. ఈ సందర్భంగా యూ మాట్లాడుతూ…  తాను పెంచుకున్న పిల్లిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లనందుకే తన పెంపుడు పిల్లి చనిపోయిందన్నారు. ఇప్పుడు బుల్లి గార్లిక్ ఇంటికి రావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.

copied-cat

Chinese firm creates first cloned kitten

Courtesy by CGTN

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్లోనింగ్ పిల్లి.. ఖరీదు తేలిస్తే షాక్ అవ్వాల్సిందే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.