అడకత్తెరలో హాంకాంగ్

  సోమవారం ఘటనలపై క్రిమినల్ దర్యాప్తు జరపండి హాంకాంగ్ సర్కార్‌కు చైనా ఆదేశం హాంకాంగ్: కనీ వినీ ఎరగని రీతిలో లక్షలాది మంది ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శకులు సోమవారం పార్లమెంటును ముట్టడించిన ప్రభావం మంగళవారం కనిపించింది. తన అధికారాన్ని పెను సవాల్ విసిరిన ఆ ప్రదర్శనలపై క్రిమినల్ దర్యాప్తు జరగాలని చైనా పిలుపునిచ్చింది. దాంతో హాంకాంగ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నేరస్థుల్ని చైనాకు అప్పగించే ప్రభుత్వ బిల్లుపై గత కొన్ని వారాలుగా హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఆగ్రహ […] The post అడకత్తెరలో హాంకాంగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సోమవారం ఘటనలపై క్రిమినల్ దర్యాప్తు జరపండి
హాంకాంగ్ సర్కార్‌కు చైనా ఆదేశం

హాంకాంగ్: కనీ వినీ ఎరగని రీతిలో లక్షలాది మంది ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శకులు సోమవారం పార్లమెంటును ముట్టడించిన ప్రభావం మంగళవారం కనిపించింది. తన అధికారాన్ని పెను సవాల్ విసిరిన ఆ ప్రదర్శనలపై క్రిమినల్ దర్యాప్తు జరగాలని చైనా పిలుపునిచ్చింది. దాంతో హాంకాంగ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నేరస్థుల్ని చైనాకు అప్పగించే ప్రభుత్వ బిల్లుపై గత కొన్ని వారాలుగా హాంకాంగ్‌లో చైనాకు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. హాంకాంగ్‌ను చైనాకు అప్పగించి 22 ఏళ్ల అయిన సందర్భంగా జరిగిన వార్షికోత్సవంలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో వలస కాలపు పతాకాన్ని ఆవిష్కరించారు. దాంతో యువకులు, ఆగ్రహం మిన్నంటింది.

పెద్ద ఎత్తున విజృంభించి.. ‘హాంకాంగ్ చైనా కాదు’ అనే నినాదాలు గోడలపై ప్రత్యక్షమయ్యాయి. ఆందోళనకారుల్లో ఒక బృందం పార్లమెంటులోకి చొచ్చుకెళ్లింది. ఆందోళనకారుల్ని అడ్డుకుని, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికి ఆ భవనంలోకి వెళ్లి లాఠీఛార్జి చేశారు. ఈ సంఘటనలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు కనీవినీ సవాలుగా మారాయి. సమయం వృధా చేయకుండా వెంటనే చైనా రంగంలోకి దిగి … సోమవారంనాటి హింసాత్మక సంఘటనలకు బాధ్యులెవరో దర్యాప్తు చేయమని హాంకాంగ్‌ను ఆదేశించింది. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న హాంకాంగ్ ప్రభుత్వానికి ఇప్పటి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది.

China says Hong Kong violence totally intolerable

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అడకత్తెరలో హాంకాంగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.