స్థూల గణాంకాలే కీలకం

China, US trade war

 

అమెరికా, చైనా వాణిజ్య చర్చలను గమనించాలి
ఈ వారం మార్కెట్‌పై నిపుణులు

ముంబై: కీలక స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా, చైనా వాణిజ్య చర్చలు, ఫెడ్ వడ్డీ రేటు నిర్ణయం ఈ వారం స్టాక్ మార్కెట్లను ప్రభావం చేసే అవకాశముందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేటు నిర్ణయం గురువారం వెలువడనుండడంతో ప్రపంచ మార్కెట్లు ఈ అంశంపై దృష్టిపెట్టాయి. దీంతోపాటు అంతర్జాతీయంగా ఇతర అంశాలు, స్టాక్ మార్కెట్ పరిణామాలనూ గమనించాలని, అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశం ఫలితం కూడా మార్కెట్లకు కీలకం కానుందని సామ్కో సెక్యూరిటీస్ అండ్ స్టాక్‌నోట్ వ్యవస్థాపకుడు జిమీత్ మోడీ తెలిపారు.

అమెరికా, చైనా వాణిజ్య చర్చల పురోగతిపై దృష్టి పెట్టాలని అన్నారు. దేశీయంగా చూస్తే రెండు గణాంకాల వివరాలను గురువారం ట్రేడింగ్ అవర్స్ తర్వాత వెల్లడించనున్నారని, అవి పారిశ్రామిక ఉత్పత్తి, ద్రవ్యోల్బణ రేటు, ఈ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావం చేయనున్నాయని జిమీత్ అన్నారు. గత వారం సెన్సెక్స్ 348 పాయింట్లు (0.85 శాతం) కోల్పోయింది. ఆర్‌బిఐ నుంచి రేటు కోత లేకపోవడంతో మార్కెట్లు నిరాశ చెందాయి. ఇంకా ఇన్వెస్టర్లు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ, చమురు ధరలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పైనా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

విదేశీ మార్కెట్ల నుండి 3.41 బిలియన్ డాలర్లు
విదేశీ మార్కెట్ల నుండి అప్పుగా భారతీయ కంపెనీలు సేకరించిన మొత్తం 2019 అక్టోబర్‌లో 3.41 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ నెల ప్రారంభంలో దేశీయ కంపెనీలు 1.41 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని సమీకరించాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) డేటా ప్రకారం, అక్టోబర్‌లో దేశీయ కంపెనీలు సేకరించిన నిధులలో 2.87 బిలియన్ డాలర్లు ఎక్స్‌టర్నల్ కమర్షియల్ క్రెడిట్ (ఇసిబి) ఆటోమేటిక్ అప్రూవల్ రూట్ ద్వారా సేకరించారు. అదే సమయంలో ఇసిబి ఆమోదం ద్వారా. 53.8 మిలియన్ డాలర్లు వసూలు చేశారు.

ఇసిబి విభాగంలో ఆటోమేటిక్ రూట్ క్యాపిటల్‌ను పెంచే ప్రధాన కంపెనీలు ముథూట్ ఫైనాన్స్ (400 మిలియన్ డాలర్లు), హెచ్‌పిసిఎల్- మిట్టల్ ఎనర్జీ (300 మిలియన్ డాలర్లు), (200 మిలియన్ డాలర్లు), డెక్కన్ ఫైన్ కెమికల్స్ (140 మిలియన్ డాలర్లు), ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (75 మిలియన్ డాలర్ల్లు). రెండు కంపెనీలు జెఎస్‌డబ్ల్యు స్టీల్ (400 మిలియన్ డాలర్లు), శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ (138 మిలియన్ డాలర్లు) ఈ ఏడాది అక్టోబర్‌లో ఆమోదం మార్గం ద్వారా మూలధనాన్ని సేకరించాయి. ఈ సమయంలో మసాలా బాండ్స్, రూపాయి బేస్డ్ బాండ్ల నుండి ఎటువంటి మొత్తాన్ని సేకరించలేదు.

China exports fall again as US trade war continues

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్థూల గణాంకాలే కీలకం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.