చైనాకు రిలీఫ్

  బీజింగ్: కరోనా వైరస్ జన్మస్థలం చైనాలో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఈ విషయాన్ని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సి) నిర్థారించింది. వూహాన్ ప్రధాన కేంద్రంగా దాదాపు మూడు నెలల క్రితం కరోనా వైరస్ కోవిడ్ 19 తలెత్తింది. ఇప్పుడు ఈ వైరస్ పుట్టిన వూహాన్‌తో పాటు చైనాలో మరెక్కడా కరోనా కేసులు నమోదు కాలేదని వెల్లడైంది. కరోనా కట్టడి గురించి ఎన్‌హెచ్‌సి రోజువారీ బులెటిన్‌లో చైనాలో కొత్త కేసులు తలెత్తలేదని […] The post చైనాకు రిలీఫ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బీజింగ్: కరోనా వైరస్ జన్మస్థలం చైనాలో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఈ విషయాన్ని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సి) నిర్థారించింది. వూహాన్ ప్రధాన కేంద్రంగా దాదాపు మూడు నెలల క్రితం కరోనా వైరస్ కోవిడ్ 19 తలెత్తింది. ఇప్పుడు ఈ వైరస్ పుట్టిన వూహాన్‌తో పాటు చైనాలో మరెక్కడా కరోనా కేసులు నమోదు కాలేదని వెల్లడైంది. కరోనా కట్టడి గురించి ఎన్‌హెచ్‌సి రోజువారీ బులెటిన్‌లో చైనాలో కొత్త కేసులు తలెత్తలేదని ఇందులో తెలిపారు. అయితే ఇప్పటికే వ్యాధి తీవ్రతకు గురైన వారిలో మరో ఎనిమిది మంది మృతి చెందారు.

దీనితో ఇప్పటికీ చైనాలో మృతుల సంఖ్య 3245కు చేరుకుంది. బుధవారం చైనాలో 34 కొత్త కేసులు నమోదు అయిన విషయం నిజమేనని ఆరోగ్య సంస్థ అంగీకరించింది. అయితే వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చిన వారే. అయితే బుధవారం, తరువాత గురువారం కూడా వూహాన్‌లో కొత్త కేసులు చోటుచేసుకోకపోవడం కీలక పరిణామంగా మారింది. ఇక దేశంలో ఇప్పటివరకూ కరోనా సోకి వివిధ స్థాయిలలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 80928గా రికార్డు అయింది. హాంగ్‌కాంగ్‌లో 192 మందికి కరోనా సోకింది. నలుగురు మృతి చెందారని అధికారికంగా వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా మృతులు 9000 పైగా యూరప్‌లో అత్యంత వేగంగా
ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావంతో మృతుల సంఖ్య 9వేలు దాటింది. అధికార గణాంకాలను క్రోడీకరించుకుని ఎఎఫ్‌పి ఈ వివరాలు తెలిపింది. గురువారం మధ్యాహ్నం వరకూ అందిన సమాచారం మేరకు మొత్తం కరోనా మృతుల సంఖ్య 9020 అని, వీరిలో యూరప్‌లో 4134 మంది, ఆసియాలో 3416 మంది చనిపోయినట్లు తేల్చారు. అయితే మొత్తం 157 దేశాలలో కరోనా ప్రభావంతో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 8809కు చేరింది. ఇక కరోనా సోకిన వారి సంఖ్య 2,18,631కు చేరింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ వారి రికార్డులలో ఈ విషయం స్పష్టం అయింది. ఆసియాలో అందులోనూ చైనాలో కరోనా తగ్గుముఖం పడుతోంది. అయితే ఇదే సమయంలో యూరప్ దేశాలలో కోవిడ్ 19 అత్యంత వేగవంతంగా విస్తరిస్తోంది.

గత 24 గంటలలో కరోనాతో 712 మంది మృతి చెందారు. మొత్తం మీద ఇప్పుడు యూరప్ అంతా కరోనా కోరలలో చిక్కుకుంది. జర్మనీలో కరోనా వైరస్ కేసులు పదివేలకు పైగా నమోదు అయ్యాయి. ఒక్కరోజే 2801 మందికి కరోనా లక్షణాలు నిర్థారణ అయినట్లు తేలడంతో అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తం అయ్యారు. ప్రజలు తమకు తాము ఎక్కడికక్కడ దిగ్బంధంలో ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ వస్తూ ఉన్నా ఫలితం ఉండటం లేదు. దీనితో అనివార్యంగా అధికారికంగా పలు ప్రాంతాలలో దిగ్బంధం విధించే పరిస్థితి ఏర్పడింది. వచ్చే కొద్ది రోజులలో ప్రజల కదలికలపై పూర్తి స్థాయి ఆంక్షలు ఉంటాయని బెర్లిన్ మేయర్ మైకెల్ ముల్లెర్ సంకేతాలు వెలువరించారు.

ఇటలీలో ఒక్కరోజే 475 మంది మృతి
ఇటలీలో కరోనా భయానకంగా మారింది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 475 మంది కరోనాతో దుర్మరణం చెందినట్లు రికార్డులు తెలిపాయి. ఒక్కరోజే ఇంత సంఖ్యలో కరోనాకు బలి కావడం ఏ దేశంలోనూ జరగలేదు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య ఇప్పుడు 2978కు చేరుకుంది. దీనితో చైనా తరువాత ఇటలీలోనే కరోనా ప్రభావం పడింది. దీనితో ఇటలీవాసులకు కరోనా కరకు అనుభవాలను మిగిల్చింది. ఇతర దేశాల్లో ఎక్కడా ఇటలీ వారిని అనుమతించడం లేదు. కాగా దేశంలో పూర్తి స్థాయి దిగ్బంధం నెలకొంది. దీనితో రోమ్ ఇతర ప్రాంతాలలో జనం నరకం అనుభవిస్తున్నారు. ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 368 మంది కరోనాతో కన్నుమూశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా మృతులలో ఇటలీ మృతుల సంఖ్య 34.2 శాతంగా నమోదు అయింది.

ఇక దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య ఇప్పటికైతే 35713గా ఉంది. ఆరు కోట్ల జనాభా ఉన్న ఈ మధ్యధరా దేశంలో ఓ వైపు పలు ఆంక్షలు చేపట్టినా ఎక్కడా అదుపులోకి వస్తున్న దాఖలాలు కన్పించడం లేదని వెల్లడైంది. ప్రజలంతా నమ్మకంతో ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం వీడరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. మరికొద్ది రోజులు ఆగితే అంతా సర్దుకుంటుందని, అప్పటివరకూ ఆందోళన చెందవద్దని ఇటలీ జాతీయ ఆరోగ్య సంస్థ ఉన్నతాధికారి సిల్వియో బ్రుసఫెరో తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఇటలీలో షట్‌డౌన్ పాటిస్తూ వస్తున్నారు. ఇది ఈ నెల 25వరకూ అమలులో ఉంటుంది. అయితే ఆంక్షలు ఈ నెలాఖరు వరకూ పొడిగించే వీలుందని వెల్లడైంది.

ఇరాన్‌లో మరో 149 మంది మృతి
కరోనా ప్రభావంతో ఇరాన్‌లో మరో 149 మంది మృతి చెందారు. దీనితో ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 1284కు చేరింది. దీనితో ఈ చమురు సంపన్నదేశం కరోనా ప్రభావక్రమంలో మూడో దేశంగా మారింది. దేశంలో మొత్తం 18407 మంది కరోనాకు గురి అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. స్పెయిన్‌లో 24 గంటల వ్యవధిలోనే కరోనా మృతుల సంఖ్య 30 శాతం పెరిగింది. దీనితో ఇప్పటివరకూ చనిపోయిన వారి సంఖ్య 767కు చేరుకుంది. ఈ దేశంలో దాదాపు 18వేల మందికి కరోనా సోకింది. ఈ సంఖ్య వచ్చే కొద్ది రోజులలో మరింత పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు.

China epicentre records no new corona case

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చైనాకు రిలీఫ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: