కరోనాను పసికట్టే పోలీసు డాగ్స్..

Chile Police train dogs to sniff out Coronavirus

శానిటాగో: ప్రజల ఆరోగ్యం పాలిట బందిపోటుగా మారిన కరోనా వైరస్‌ను పసికట్టేందుకు పోలీసు శునకాలు వస్తున్నాయి. చిలీ పోలీసులు తమ డాగ్‌స్కాడ్స్‌కు వైరస్‌ను పసిగట్టే దిశలో శిక్షణ ఇస్తున్నారు. సాధారణంగా పోలీసు జాగిలాలు హత్యలు ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు కీలక సాక్షాలను పసికడుతుంటాయి. అయితేఇప్పుడు వీటిని ఏఏ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి ఉందనేది ఈ జాగిలాలు కనుగొనేందుకు వీలుంది. ఈ దిశలో అత్యంత క్లిష్టమైన శిక్షణ కోసం చిలీపోలీసులు కొన్ని కుక్కలను ఎంపిక చేశారు. ప్రజల చమటలో దాగిన వైరస్ కణాలను ఈ శునకాలు వాసన ద్వారా కనుగొంటాయి. ఈ విధంగా వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించి విడిగా ఉంచేందుకు వీలేర్పడుతుంది. కరోనా డాగ్‌లకు శిక్షణ కార్యక్రమం ఇప్పుడు ఇంకా ప్రాధమిక దశలో ఉందని అక్కడి ఉన్నతాధికారులు తెలిపారు.

బ్రిటన్‌లో కూడా ఈ దిశలో కుక్కలకు ప్రత్యేక తర్ఫీదు ఇప్పిస్తున్నారు. చిలీ రాజధాని శానిటాగోలోని ప్రత్యేక చిలియన్ కారబినిరో శిక్షణ కేంద్రంలో నాలుగు శునకాలకు శిక్షణ ఇస్తున్నారు. వీటికి ప్రత్యేకమైన స్పోర్ట్ గ్రీన్ బయోడిటెక్టర్ జాకెట్లు వేశారు. స్నిఫర్ డాగ్స్‌తో డ్రగ్‌స, పేలుడు పదార్థాలను గుర్తించవచ్చు. ఇంతకుముందు మలేరియా, క్యాన్సర్, పార్కిన్‌సన్‌వంటి వ్యాధులు వచ్చిన వారిని గుర్తించేందుకు పోలీసు డాగ్స్‌కు శిక్షణ ఇప్పించారు. చిలీలో పోలీసు శిక్షణా కేంద్రం డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ క్రిస్టియన్ యానెజ్ ఈ శిక్షణ కార్యక్రమం గురించి స్పందించారు. మనుష్యులతో పోలిస్తే శునకాలలో సగానికి పైగా గ్రాహకశక్తి ఉంటుందని తెలిపారు. వాటిలో 30 లక్షల గ్రాహక కేంద్రాలు ఉంటాయి. వాటికున్న అపార గ్రాహక శక్తితో కరోనా వైరస్ ఉనికిని తేలిగ్గా పసికట్టేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.

Chile Police train dogs to sniff out Coronavirus

The post కరోనాను పసికట్టే పోలీసు డాగ్స్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.