బోసి నవ్వులే మెదడుకు బలం…!

  పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటే తల్లులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. పిల్లలు హాయిగా నవ్వడానికి వారిని ఎగరేసి ఎత్తుకుంటారు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటారు. తల్లి చేసే ఈ ప్రయత్నాలకు పిల్లలు సహజంగానే బిగ్గరగా నవ్వుతుంటారు. ఈ నవ్వే వారి మెదడుకు ఆరోగ్యాన్నీ, బలాన్నీ ఇస్తుందంటున్నారు ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు. పిల్లలు నవ్వుతూ సంతోషంగా, ఆనందంగా ఉండడం వల్ల వారి మెదడు మరింత చురుకుగా అభివృద్ధి చెందుతుందనీ, తల్లి పాటలు వినే పిల్లల మెదడులో న్యూరాల్ నెట్‌వర్క్ […] The post బోసి నవ్వులే మెదడుకు బలం…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటే తల్లులకు ఎంతో సంతోషంగా ఉంటుంది. పిల్లలు హాయిగా నవ్వడానికి వారిని ఎగరేసి ఎత్తుకుంటారు. ఒడిలో కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటారు. తల్లి చేసే ఈ ప్రయత్నాలకు పిల్లలు సహజంగానే బిగ్గరగా నవ్వుతుంటారు. ఈ నవ్వే వారి మెదడుకు ఆరోగ్యాన్నీ, బలాన్నీ ఇస్తుందంటున్నారు ఫ్లోరిడా యూనివర్సిటీ పరిశోధకులు.

పిల్లలు నవ్వుతూ సంతోషంగా, ఆనందంగా ఉండడం వల్ల వారి మెదడు మరింత చురుకుగా అభివృద్ధి చెందుతుందనీ, తల్లి పాటలు వినే పిల్లల మెదడులో న్యూరాల్ నెట్‌వర్క్ మెరుగు పడడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇందుకోసం కొంతమంది పసిపిల్లలమీద వీరు సుదీర్ఘ అధ్యయనం చేశారు. కొందరి పిల్లల్ని తల్లులు ఎక్కువసేపు ఆడించి, నవ్వించమన్నారు. అంతేకాకుండా వీరి చేత లాలిపాటలను కూడా పాడించారు. మరికొంతమంది పిల్లల్ని మామూలుగానే ఆడించమన్నారు. తల్లులు చేత లాలిపాటలు కూడా పాడించలేదు. కొన్నిరోజుల తర్వాత పిల్లల మెదడును పరిశీలించారు. మొదటి గ్రూపు పిల్లల మెదడులో స్పెన్సరీ వ్యవస్థ మెరుగుపడగా, రెండో గ్రూపు పిల్లల మెదడులో అలాంటి మార్పు కనిపించలేదు. పసిపిల్లల్ని అటూ ఇటూ ఊపుతూ ఆడించడం, వారిని తరచుగా నవ్వించడం వంటి పనులు చేస్తే వారి ఆరోగ్యంతో పాటు మెదడు కూడా బాగా వృద్ధి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Child’s Laughter is the Strength to Brain

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బోసి నవ్వులే మెదడుకు బలం…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.