చిన్నారులు బడి బాట పట్టెనా…?

  షాద్‌నగర్ : సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా రూపొందించిన విద్యాహక్కు చట్ట ఆశయం నెరవేరడం లేదు. పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతులు చిత్తు కాగితాలు ఏరి, బిక్షాటనలు చేస్తున్నాయి. ఆడుతూ.. పాడుతూ హాయిగా గడపాల్సిన జీవితాన్ని ఇటుక బట్టీలలో.. హోటళ్ళలో వెట్టి చాకిరికి అంకితం చేస్తున్నారు. బాల్యం బంది అయిపోతూ.. వృధా అవుతున్న బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన చట్టాలు నీరు గారిపోతున్నాయి. మరి విద్యాశాఖ అధికారులు నిర్లక్షం వీడి బతుకు బండిని లాగేందుకు బాల్యాన్ని […] The post చిన్నారులు బడి బాట పట్టెనా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

షాద్‌నగర్ : సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా రూపొందించిన విద్యాహక్కు చట్ట ఆశయం నెరవేరడం లేదు. పలకా బలపం పట్టాల్సిన చిట్టి చేతులు చిత్తు కాగితాలు ఏరి, బిక్షాటనలు చేస్తున్నాయి. ఆడుతూ.. పాడుతూ హాయిగా గడపాల్సిన జీవితాన్ని ఇటుక బట్టీలలో.. హోటళ్ళలో వెట్టి చాకిరికి అంకితం చేస్తున్నారు. బాల్యం బంది అయిపోతూ.. వృధా అవుతున్న బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన చట్టాలు నీరు గారిపోతున్నాయి. మరి విద్యాశాఖ అధికారులు నిర్లక్షం వీడి బతుకు బండిని లాగేందుకు బాల్యాన్ని వృధా చేస్తున్న వారికి విముక్తి కల్పించి అక్షరాలు దిద్దించాల్సిన ఆవశ్యకత ఉంది. మండల పరిధిలోని గిరిజన తాండాలు ఎక్కువగా ఉండటంతో లంబాడి తాండాల పిల్లలను పాఠశాలల్లో చేర్చేందుకు దృష్టి సారించడం లేదు అనే అనుమానాలు, అపోహలు ఉన్నాయి.

ఇందుకు కారణం గిరిజన తాండాలలో ఉపాధ్యాయులు పాఠశాలలకు సరిగ్గా రాకపోవడం సమయ పాలన పాటించక పోవడం ప్రధాన కారణం అని పలువురు గిరిజన తాండావాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారులు పశువులను మేపడానికి, ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కొనసాగించేందుకు వచ్చిన కుటుంబాల చిన్నారులు, తల్లిదండ్రులతో పాటు ఇటుక బట్టీలలో పనికి పరిమితమై చదువులకు దూరమవుతున్నారనే వాదన కూడా ఉంది. షాద్‌నగర్ ముఖ్య కూడలి వద్ద బడీడు పిల్లలు చిరిగిన, మాసిన దుస్తులతో బిక్షాటన చేస్తున్నారు. కూటి కోసం కోటి విద్యలు పడుతున్నారు.

బస్టాండ్, రైల్వే స్టేషన్, హోటళ్ళు, లాడ్జీల్లో దర్శనమిస్తున్నారు. విద్యా హక్కు చట్టం, కార్మిక శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. బాల కార్మికుల నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన పలు కార్యక్రమాలు చట్టాలన్ని మొక్కుబడిగా అమలవుతున్నాయి. సంపూర్ణ అక్షరాస్యత లక్షంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లో పిల్లలకు విద్యను అందించాలనే లక్షం నెరవేరటం లేదు.

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్‌రోల్ మెంట్ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యా పక్షోత్సవాలు, విద్యాసంబురాలు, ఆచార్య జయశంకర్ చదువుల పండుగా ఇలా గత పదేళ్ళలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే పిల్లలు బడిలో ఉండేవారు కాని ఇలా జరగండం లేదు. వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి బిన్నంగా కనిపిస్తుంన్నాయి. ఈ సారైనా బడిబయట పిల్లలు బడిలో చేరేనా అనే సందేహాలు నెలకొంటున్నాయి.

 

Children should be Sent to School

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిన్నారులు బడి బాట పట్టెనా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.