మభ్యపెట్టొద్దు!

  పాపాయిలుంటే ఇల్లంతా నవ్వుల పువ్వులే. వాళ్ల పెంపకంతో సర్వం మరచి పోతారు ఇంట్లో అందరూ. బుజ్జి పాపాయికి కష్టం కలగకుండా ఏవేవో మాటలు చెప్పి వాళ్ల పనులు పూర్తిచేయాలని చూస్తారు. ఆ క్రమంలో ఎన్నో అబద్ధాలూ దొర్లుతాయి. ఇదిగో అల్లరి చేయకుండా స్నానం చేశావా.. నీకు ఏనుగుబొమ్మ కొనిపెడతా. గమ్మున అన్నం తినేయమ్మా.. నీకు లడ్డు ఇస్తాగా…లేదా పువ్వుల గౌను వేస్తాగా ఇలాంటి చిట్టి పొట్టి అబద్ధాలు ఆడేసి, పని పూర్తయ్యాక చిన్న పిల్లలు వాళ్లకేం […] The post మభ్యపెట్టొద్దు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పాపాయిలుంటే ఇల్లంతా నవ్వుల పువ్వులే. వాళ్ల పెంపకంతో సర్వం మరచి పోతారు ఇంట్లో అందరూ. బుజ్జి పాపాయికి కష్టం కలగకుండా ఏవేవో మాటలు చెప్పి వాళ్ల పనులు పూర్తిచేయాలని చూస్తారు. ఆ క్రమంలో ఎన్నో అబద్ధాలూ దొర్లుతాయి. ఇదిగో అల్లరి చేయకుండా స్నానం చేశావా.. నీకు ఏనుగుబొమ్మ కొనిపెడతా. గమ్మున అన్నం తినేయమ్మా.. నీకు లడ్డు ఇస్తాగా…లేదా పువ్వుల గౌను వేస్తాగా ఇలాంటి చిట్టి పొట్టి అబద్ధాలు ఆడేసి, పని పూర్తయ్యాక చిన్న పిల్లలు వాళ్లకేం తెలుసులే అని వదిలేస్తారు. కానీ వాళ్ల పసి మనసుల్లో అమ్మ, నాయనమ్మ, నాన్న ఎవరూ నిజం చెప్పటం లేదన్న ముద్రపడి పోవచ్చు లేదా ఇలా లంచం ఇస్తేనే మాట వింటా అనే మొండితనం తలెత్తొచ్చు. అబద్ధాలతో జీవితం ఇంకాస్త సుఖంగా దొర్లించవచ్చు అన్న భరోసా కూడా రావచ్చు. అందుకే ఇలాంటి ప్రమాదాలు రాకుండా పిల్లలచేత కొన్ని పనులు సులభంగా ఎలా చేయించవచ్చో చెబుతున్నారు నిపుణులు. చైల్డ్ సైకాలజిస్టులు కూడా వాటికి సర్టిఫికెట్ ఇచ్చేశారు.

పిల్లలకు పళ్లు తోమించటం చాలా కష్టంతో కూడుకున్న పని. రెండేళ్ల వయసు నుంచి పళ్లు తోమటం అలవాటు చేయాలి కదా! ముందుగా పిల్లలకు అందమైన రంగు రంగుల బ్రష్ కొనివ్వాలి. ఇప్పుడు పిల్లల కోసం ప్ర త్యేకమైన బొమ్మల బ్రష్‌లు కూడా వచ్చాయి. బ్రష్ చేసేటప్పుడు పిల్లలకు సరదా కావాలి. అప్పుడు మనం చెప్పేవి అర్ధం అవుతాయి. పళ్ళు సరిగా తో మకపోతే క్యావిటీలతో పుచ్చి పోతాయని వాళ్లకు అర్థం అయ్యేట్లు చెప్పొ చ్చు. వాళ్లకు బ్రష్‌ను ఒక ఆటలాగా పళ్లు ఎడాపెడా తోమకుండా సరదాగా చేసేలాగా నేర్పండి. పిల్లలు వింటారా అనే సందేహం వద్దు. కొత్త కొత్త ఈవెంట్స్ సృష్టిస్తూ పోవాలి.

తల స్నానం చేయించాలి: పిల్లలకు సాధారణంగా నీళ్లల్లో ఆడటం ఇష్టం. మనం ముందే తలస్నానం చేయిస్తాను రమ్మని పిలిస్తే , అదేదో మనకు పని కి వచ్చే పనిగా గుర్తించి వాళ్లు రాను పొమ్మంటారు. అది ఆటగానే మొదలు పెట్టాలి. షాంపూ నురగతో డిజైన్‌లు చేసి పిల్లలని ఉత్సాహపరచవచ్చు. కళ్ల కు స్విమ్ గూగుల్స్ పెట్టి, ఒకహెడ్ బాండ్ పెట్టి వాళ్లలో ఉత్సాహం తేవచ్చు. కొన్ని అవుట్‌లెట్స్‌లో షాంపూ రిన్స్ కప్స్ దొరుకుతాయి. పిల్లల కోసం దొరికే వస్తువులు గమనించండి. ఇంట్లో మరీ ఇరుకుగా లేని రంగుల టబ్ లు, కళ్లకి నచ్చే టాయిస్ రూపంలో ఉండే మగ్గులు ఇవన్నీ కొనండి. వాళ్ళే నీళ్లతో ఆడేలా అలవాటు చేయాలి.

పిల్లలకు చిన్న అనారోగ్యాలు వస్తే: పిల్లలకు దగ్గులు, తుమ్ములు వంటివి వచ్చినా కష్టమే. మనలాగా వాళ్లు టాబ్లెట్ మింగి, మందు తాగి పడుకోరు. మరీ పసివాళ్లయితే మన ట్రిక్కులు ఏమీ పనిచేయవు. కాళ్లపైన పడుకోబెట్టి బుగ్గలు సాగదీసే వాళ్లు, ఏడవగానే నోట్లో మందు వంపేయటం తప్ప వేరే దారి లేదు. కాస్త ఊహ తెలిస్తే కష్టం. అది మందు వేస్తున్నాం అని చెప్పే పరికరాలు ఏవీ వాళ్ల కంటబడద్దు.
తియ్యని తేనె అందమైన స్పూన్‌తో తెచ్చి తియ్యగా ఉండి, నీకు జ్వరం కదా దగ్గుతున్నావు కదా అని అందుకే తేనె తెచ్చానని మొదలు పెట్టి, ఇక మం దునీ ఆ వరసలో వేసేయటమే. మందు దేనితో ఇవ్వచ్చో డాక్టర్‌ను ముందే కనుక్కొంటే ఏ పదార్థంతో మందు ఇవ్వచ్చో తెలిసిపోతుంది. పళ్లతో, పళ్ల రసంతో ఏదోలాగా అతి తక్కువ మోతాదులో పిల్లల కడుపులోకి వెళ్లేలా చేయాలి. ఓ గ్లాస్ జ్యూస్‌లో స్పూన్ మందు కలిపాక వాళ్లు తాగను పొమ్మంటే ఇక టాబ్లెట్ మాత్రమే వేయాలి.. అనుకుంటే ఏకస్టర్డ్‌తో నోబెటర్ అవకాశాలు పిల్లలకే ఇస్తున్నట్లు ఉండాలి.
అప్పుడు పరిస్థితి తమ కంట్రోల్‌లో ఉన్నట్లు పిల్లలు భావిస్తారు. స్ట్రయిట్‌గా ఈ మందు వేసుకోకపోతే దగ్గు తగ్గదు. నువ్వు కూర్చుని వేసుకొంటావా, నుల్చుని మిం గుతావా, జ్యూస్‌తో ఇవ్వనా! ” వంటి మా టల్ని మన మొహం లో సీరియస్‌నెస్ చూపిస్తూ, మందు మింగక తప్పదు అన్న విషయం వాళ్ల బుర్రలోకి ఎక్కించి, అది నిలుచునా? పడుకోనా? ఎట్లా? అన్న ఆష్షన్ వాళ్లకు మిగిలింది అని వాళ్లు అర్థం చేసుకొనేలా చేస్తే చాలు. మనం లొంగుతాము అన్న ఫీలింగ్ పిల్లలకు కలిగించామా వా ళ్లు కచ్చితంగా మనల్ని ఆడిస్తారు.
అలాగే పిల్లలకు టెంపరేచర్ చూడటం కూడా సమస్యే. ఏడుస్తారు, కదులుతారు డాక్టర్లు డిజిటల్ ధర్మామీటర్‌ను మలద్వారంలో కూడా పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తారు. నాలుక కింద పెద్దవాళ్ల లాగా పెట్టి టెంపరేచర్ చూడలేకపోతే చంకలో పెట్టి చూడటమే. ఇంకాస్త పెద్దయితే వాళ్లకు టెంపరేచర్ చూడటం నేర్పి వాళ్లచేత చెక్ చేయించి వాళ్ల ముందే నోట్ చేస్తే వాళ్ల లో తాము పెద్దవాళ్లమని, చాలా గొప్పగా టెంపరేచర్ చూసుకోగలిగామనే ఫీలింగ్ వస్తుంది. ఇదంతా పిల్లల్లో తమను మాయచేసి పెద్దవాళ్లు ఏదో చేస్తున్నా రు అన్న భయం పోగొట్టటం కోసమే.
ఇప్పుడు కారు ప్రయాణాలు వచ్చాయి. పిల్లలతో ప్ర యాణం చేసినప్పుడు వాళ్లను కదలకుండా కూర్చోబెట్టడం కాస్త కష్టమే. ఇప్పుడే కాస్త తెలివిగా ఉండండి. వాళ్లను మీ తోటి వాళ్లలాగా ట్రీట్ చేయండి. నాన్న సీట్ బెల్ట్ పెట్టుకో. పోలీస్ చెకింగ్ ఉంటుంది. ఫైన్ వేస్తారు అనే అలవాటు చేయాలి. పిల్లలకు సంబంధించిన ఏ పని అయినా సంప్రదాయబద్ధంగా కాకుండా వీలైనంత వరకు వాళ్లను ఉత్సాహంగా, సరదాగా ఉండేలా చేస్తూ, వాళ్లకు సంతోషం కలిగించటం ద్వారా ఆ పని సులభంగా పూర్తి చేయించవచ్చు. ఈ నేర్పటం అన్న ప్రక్రియ అలా వాళ్ల జీవితంలో పసితనం నుంచి మొదలై పెద్దవాళ్లై స్థిర పడేవరకు నడుస్తుంది.
పిల్లలకు అనుకరణ ఇష్టం: వాళ్ళు ఎప్పుడూ పెద్దవాళ్ల అడుగుజాడల్లో నడుస్తూ, వాళ్లు ఏం చేస్తే దాన్ని అనుకరిస్తారు, అనుసరిస్తారు. వాళ్లకు మంచి మాటలు, ప్రవర్తన, అలవా ట్లు నేర్పండి. అవే మన జీవితంలోనూ ఆచరిస్తూ ఉంటేనే పిల్లలు వంటబట్టించుకుంటారు. పిల్లలు ఇంకాస్త పెద్దయితే మంచి పుస్తకాలు చదవటం, మంచి ఆరోగ్యకరమైన భోజనం చేయ టం, మంచిగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవటం ఇవన్నీ మనం నేర్పితేనే అలవాటు అవుతాయి. పిల్లల్లో వికాసం చూడాలంటే ముందు వాళ్ల చుట్టూ వికాసవంతమైన వాతావరణం ఉండాలి. పెద్దవాళ్లు నిజాయితీగా సత్ప్రవర్తనతో ఉండాలి. అలాంటి తల్లిదండ్రుల అడుగుజాడల్లో పిల్లలు ఉత్తమ పౌరులు అవుతారు.

Children should be raised as best citizens

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మభ్యపెట్టొద్దు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.