బాల సాహిత్య వికసనం

  మొగ్గలాంటి విద్యార్థులను వారి స్వీయ రచనలు, సేకరించిన రచనలు, విద్యావికాస కార్యక్రమాలకు సంబంధించి ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో విరబూసిన పువ్వులవలె వికసింపజేయాలి.”ప్రస్తుత పరిస్థితులలో బాల సాహిత్య సృజనకారులు, బాలలు, ఉపాధ్యాయులు, సమాజం, ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంధ సంస్థలపై మాటలను ఆచరించి బాలల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో వుంది. బాల సాహిత్యం నిర్వచణం పరిధి “బాలల కోసం, వారి స్థాయికి అనుగుణమైన, వారి నిత్య జీవిత అంశాలతో పాటు ప్రతిభను పెంచి, అభ్యసనమును సైతం తోడ్పడే […]

 

మొగ్గలాంటి విద్యార్థులను వారి స్వీయ రచనలు, సేకరించిన రచనలు, విద్యావికాస కార్యక్రమాలకు సంబంధించి ఉపాధ్యాయ మార్గదర్శకత్వంలో విరబూసిన పువ్వులవలె వికసింపజేయాలి.”ప్రస్తుత పరిస్థితులలో బాల సాహిత్య సృజనకారులు, బాలలు, ఉపాధ్యాయులు, సమాజం, ప్రభుత్వాలు, వివిధ స్వచ్ఛంధ సంస్థలపై మాటలను ఆచరించి బాలల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో వుంది.

బాల సాహిత్యం నిర్వచణం పరిధి
“బాలల కోసం, వారి స్థాయికి అనుగుణమైన, వారి నిత్య జీవిత అంశాలతో పాటు ప్రతిభను పెంచి, అభ్యసనమును సైతం తోడ్పడే అంశాలు బాలల రచనలు బాల సాహిత్యాన్ని సృష్టించే పెద్దల రచనలంతా కలిసి బాల సాహిత్యమే అవుతుంది. అంటే దీనికి కేంద్రం బాలల జీవితం… బాల్య జీవితం.” దీని పరిధిని ఆలోచించినప్పుడు విద్యార్థి తన పరిసరాలు, స్వీయ అనుభవాలు, అనుభూతులు చిన్ని చిన్ని మాటలలో రాయడంతో పాటు పాఠశాలలో ఉపాధ్యాయులు తమ పాఠ్య బోధనకు అనుబంధంగా సందర్భోచితంగా ఉన్ముఖీకరణ కోసం కొంత సాహిత్యాన్ని సృష్టించవలసి వుంటుంది. ప్రభుత్వ పరంగా పాఠ్య పుస్తకాల నిర్మాణంలో బాల సాహిత్య రచయితల సలహా ప్రకారం పాఠాలు, గేయాలు, కథలు, సంభాషణలు రూపొందించవలసి వుంటుంది. మరో అడుగు ముందుకు వేసి ప్రభుత్వం వివిధ స్థాయిలలో బాల సాహిత్యం గూర్చిన కార్యకలాపాలు నిర్వహించవలసిన అవసరం ఎంతైనా వుంది.

బాల సాహిత్య రచయితలు “బాలల జీవితం సమాజం సవాళ్ళను” ప్రాతిపదికగా చేసుకొని రచనలు చేసినప్పుడే దీని లక్షం నెరవేరుతుంది. బాల సాహిత్యం పాత్ర కేవలం పాఠశాలలోనే గాక వివిధ అనియత కేంద్రాలు, అనాధాశ్రమాలు, శిక్షణా సంస్థలు ఇండ్లల్లో అంతటా కొనసాగాల్సిన సామాజిక బాధ్యత గలది. దీనికి నిర్దేశిత లక్షాలు. ఆ లక్షాలను ప్రస్ఫుటించే లక్షణాలు, లక్షాలు, లక్షణాలను బాలల్లో వివిధ దశలలో నిబిడీకృతం చేయడానికి తీసుకోవలిసిన చర్యలు అర్థవంతంగా ఉన్నప్పుడే బాలల మూర్తిమత్వ వికాసానికి బాలసాహిత్యం దోహదపడుతుంది. అవి స్వీయ అనుభూతి చెందేలా వుండాలి. అంటే స్వీయ అనుభవాలు రచనకు ఉపయోగపడుతాయి. గేయాలు, సంభాషణలు, కథలు, చిత్రకథలు, చిన్ని చిన్ని మాటలతో కూడిన వాక్యాలు, పెద్దలు, పిల్లల గూర్చి రాసిన పద్యాలు వేమన, సుమతి శతకంలోని పద్యాలు, నైతిక అంశాలు, కుటుంబబంధాలు, ధర్మాలు, మానవ సంబంధాలు, సాహసగాధలు, విజయగాథలు, పరిసరాలు, పర్యావరణము వంటి అంశాలు మెండుగా వుండాలి. అవన్నీ బాలల స్థాయికి, వారి ఆలోచనా సరళికి దగ్గరగా అనుగుణంగా వుండాలి.

స్వీయ రచనలు, సేకరించినవి. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో రూపుదిద్దుకున్నవి. బాల సాహిత్యం కవులు పిల్లల స్థాయికి దిగి అవగాహన అయ్యేవిధంగా రాసినదంతా బాలసాహిత్యమే అవుతాయి. స్ఫూర్తి కలిగించే అంశాలు, జ్ఞాన పరిధిని విస్తృతంచేసి అంశాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంచి దేశభక్తిని అలవరిచేవి ప్రధానంగా చెప్పాలి. ఈ లక్షణాలతో కూడిన సాహిత్యం ద్వారా బాలలకు సంబంధించి ఏయే లక్షాలు సాధించవచ్చో ఒకసారి పరిశీలిస్తే. విద్యార్థులలో దాగి వున్న సృజనాత్మకతను బయటికి తీస్తుంది. నిత్య పాఠ్యాంశాల అభ్యసనం. అభ్యాసములతో ప్రేరణ కలిగించి సులభ అవగాహనకు తోడ్పడుతుంది. పఠనాభిలాషను పెంపొందించి తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంచుతుంది. అభ్యసనం తగ్గిపోకుండా చూస్తూ, ఆత్మవిశ్వాసం పెంచుతుంది. భాషా పటిమను పెంపొందించి విస్తృత పఠనానికి తోడ్పడుతుంది. వైఖరులు, దృక్పథాలు, అలవాట్లు, భిన్న ధోరణులతో బాలలు పరిపక్వమవుతారు. సామాజిక స్పృహను పెంచి వివక్షతలు లేని సమభావాన్ని బాలలు అలవరచుకుంటారు. శాస్త్రీయ దృక్పథం, ప్రేమలు, బంధాలు బలపడతాయి. జనాభాలోమెజార్టీ భాగమైన బాలలు సాధించదగు ప్రయోజానాన్ని వివిధ లక్షాల రూపంలో చెప్పుకున్నాము. ఈ లక్ష సాధనకు వివిధ దశల్లో కృషి జరిగినప్పుడే బాలలు నిజమైన రేపటి పౌరులవుతారు. “బాలల కోసం బాలల భవిత కోసం పెద్దలు ” అనే నినాదాన్ని నిత్యం మనసులో వుంచుకొని మనమంతా కొన్ని చర్యలు చేపట్టవలసిన అవసరం వుంది.

అప్పుడే బాల సాహిత్యం సుససంపన్నమై తద్వారా బాలల లోకానికి సమాజానికి చేకూరే మేలు ఎనలేనిది. అందుకై వీలైన మేరకు పాఠశాలలు వారి పిల్లలు, ఉపాధ్యాయుల రచనలతో “సంచిక” తేవాలి. ఉపాధ్యాయులు పాఠ్యబోధకులుగానే గాక రచయితలుగా ఎదిగి ఎదిగించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రవర్తన, ఆలోచనా ధోరణులను పరిశీలించాలి. పాఠశాలల్లో ప్రత్యేక తెగల వారుంటే వారి భాషలో రచనలు ప్రోత్సహించాలి. వివిధ అంశాలిచ్చి విద్యార్థులకు సూచనల ద్వారా రచనలు చేయించాలి. రచనకు సంబంధించి ఆలోచన గల వారిని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయిలో బాల కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి. వివిధ బాలల సంచికలు, పాత చందమామ, బొమ్మరిల్లు, కథలు, గేయాలను విద్యార్థులతో చర్చించాలి. ప్రోత్సాహానికి వల్లె వేయించాలి.

ప్రభుత్వస్థాయిలో జరగాల్సిన కృషి కూడా ఇక్కడ ప్రస్తావనార్హం. అందుకోసం మండలాలు వారి విద్యార్థుల రచనల సమీకకరణ, ప్రచురణకు “సంపాదక మండలు’లను ఏర్పాటు చేయాలి.

మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి చర్చాగోష్ఠులు, శిక్షణ, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలి. కవులు, రచయితలు, ఉపాధ్యాయవర్గంలోని పండితులు, ఆసక్తిగల ఉపాధ్యాయులకు, తరచుగా వివిధ స్థాయిల్లో శిక్షణలు, చర్చలు నిర్వహించాలి. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో బాలల రచనలచే మాస, వార ‘సంచికలు’ తేవాలి. బాల సాహిత్య పరిపుష్టికి పాఠశాలలు, విద్యాసంస్థలకు నిధులివ్వాలి. వివిధ పాఠ్యాంశాలలో ప్రశ్నల ద్వారా ప్రోత్సహించి ఉత్సుకత రేకెత్తించే అంశాలుండాలి. హాస్యం, ప్రేమ వంటి రసాలుండాలి. జంతువులు, పక్షులు పాత్రలుంటే మంచిది. తెలుగు వాచకాలలో లయబద్ద గేయాలు, సరళ భాషలో సంభాషణా రూపాలు హాస్యంగా వుంటే మంచిది. గత 60 ఏళ్ల క్రితం బొమ్మరిల్లు, చందమామ పత్రికలు పిల్లలు పెద్దలను చదివించి ఉత్తేజపరిచేవి. అవి నేడు లేవు. సరళమైన భాషలో అలాంటి పత్రికలు రావాలి. బాల సాహిత్య ప్రయోజనం బాలలకు, సమాజానికి దక్కాలంటే అందరం మెరుగైన కృషి చేయాల్సి వుంది.

Child literary writers are writing of challenges of life for children

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: