దేశ ఆర్థిక స్థితిపై చిదంబరం ఆందోళన

  ట్వీట్ చేయమని తన ఫ్యామిలీని కోరిన మాజీ ఆర్థికమంత్రి న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం దేశ ఆర్థిక పరిస్థితిపై బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక పతనం నుంచి, విషాదం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు మీరేం చేయబోతున్నారు? అని మాజీ ఆర్థికమంత్రి కేంద్రాన్ని ప్రశ్నించారు. తన సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేయమని చిదంబరం తన కుటుంబాన్ని కోరారు. చిదందబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం జరిగిందన్న ఆరోపణపై […] The post దేశ ఆర్థిక స్థితిపై చిదంబరం ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ట్వీట్ చేయమని తన ఫ్యామిలీని కోరిన మాజీ ఆర్థికమంత్రి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం దేశ ఆర్థిక పరిస్థితిపై బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక పతనం నుంచి, విషాదం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు మీరేం చేయబోతున్నారు? అని మాజీ ఆర్థికమంత్రి కేంద్రాన్ని ప్రశ్నించారు. తన సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేయమని చిదంబరం తన కుటుంబాన్ని కోరారు. చిదందబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కుంభకోణం జరిగిందన్న ఆరోపణపై గతవారం ఆయనను తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

‘నా తరఫున ఈ సమాచారాన్ని ట్వీట్ చేయమని సోమవారం నా కుటుంబాన్ని అడిగాను. ‘మీ మద్దతుకు కృతజ్ఞతలు. గత కొద్ది రోజులుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. న్యాయానికి, అన్యాయానికి మధ్య తేడాను గుర్తించగలిగిన పేదల సామర్థాన్ని చూసి ఆశ్చర్యపోయాను’ అని చిదంబరం ట్వీట్ చేశారు. ‘ఆర్థికపరిస్థితి గురించి చాలా ఆందోళనగా ఉంది. పేదలే బాగా దెబ్బతిన్నారు. ఉద్యోగాలు తక్కువ కావడం, వ్యాపారం తగ్గిపోవడం, పెట్టుబడుల క్షీణత పేదల్ని, మధ్యతరగతిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్షీణత, విషాదం నుంచి దేశం బయటపడేందుకు ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది?’ అని కాంగ్రెస్ నాయకుడు ట్విటర్‌లో అడిగారు.

Chidambaram expresses concern over state of economy

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశ ఆర్థిక స్థితిపై చిదంబరం ఆందోళన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: