ఆర్థిక దుస్థితిపై యువత ఆగ్రహించే ప్రమాదం: చిదంబరం

Chidambaram

న్యూఢిల్లీ : ఆదాయం తగ్గి, నిరుద్యోగం పెరిగితే యువతలో విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికే ప్రమాదం ఎదురవుతుందని మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత పి. చిదంబరం మోడీ ప్రభుత్వ ఆర్థిక దుస్థితిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. సిఎఎ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా దేశమంతా ఆందోళనలతో నిండి యుందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక స్థితి దిగజారడం దేశానికి తీరని ముప్పుగా ఆయన వ్యాఖ్యానించారు. వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం పెరగడంపై కూడా ఆయన ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. ఆహార ద్రవ్యోల్బణం 14.2 శాతం వరకు ఉండగా, కూరగాయల ధరలు 60 శాతం పెరగడం, ఉల్లి ధరలు కిలో రూ.100కు పెరగడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇది బిజెపి ప్రభుత్వం ఇచ్చిన అచ్ఛేదిన్ హామీ అని వ్యాఖ్యానించారు.

Chidambaram attacked Narendra Modi government

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్థిక దుస్థితిపై యువత ఆగ్రహించే ప్రమాదం: చిదంబరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.