సిమీ ఉగ్రవాది అజర్ రాకపై ఎన్‌ఐఎ ఆరా!

Terrorist

స్లీపర్‌సెల్, మాడ్యుల్స్ కదలికలపై నిఘా
మనతెలంగాణ/హైదరాబాద్ : సిమీ ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఛత్తీస్‌గడ్ పోలీసులు అరెస్టు చేసిన వెంటనే ఛత్తీస్‌గడ్‌కు తరలించారు. అయితే అజర్ హైదరాబాద్ రాకపై ఎన్‌ఐఎ అధికారులు అతనికి హైదరాబాద్‌లో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హైదారాబాద్‌లోని సమీప బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో అజర్‌ను అరెస్టు చేశారు. ఆరేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న అజర్ తిరిగి తెరపైకి రావడంతో ఎన్‌ఐఎ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా నగరంలోని స్లీపర్‌సెల్, మాడ్యుల్స్ కదలికలపై నిఘా సారిస్తున్నారు. బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల సంఘటనలతో అజర్‌కు సంబంధం ఉందని గతంలో హైదరాబాద్ కేంద్రంగా మందుగుండు సామాగ్రిని తయారు చేసిన ఘటనపై తిరిగి ఎన్‌ఐఎ అధికారులు దృష్టిసారిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి హైదరాబాదులోని బంధువుల ఇంటికి రావడానికి విమానాశ్రయంలో దిగగా కెమికల్ అలీని చత్తీస్‌గడ్ పోలీసులు అరెస్టు చేసి ఇక్కడ నుంచి తరలించారు.

అలీ రాయపూర్ లోని మౌధాపరాకు చెందిన అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ ఆరేళ్లుగా అతను సౌదీ అరేబియాలో తలదాచుకున్నాడు. ఈక్రమంలో సౌదీ అరేబియాలోని ఓ సూపర్ మార్కెట్లో అతను సేల్స్ మెన్, డ్రైవర్‌గా పనిచేస్తూ పలు ఉగ్రకుట్రలకు కీలక పాత్ర వహించినట్లు ఎన్‌ఐఎ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అజర్ సౌదీఅరేబియా నుంచి భారత్ వస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్‌ఐఎ వర్గాలు హైదరాబాద్‌లోని పాతబస్తీ, పరిసర ప్రాంతాల్లో, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లోని స్లీపర్‌సెల్, మాడ్యుల్స్ కదలికలపై నిఘా పెంచారు. నగరంలోని కొందరు ఉగ్రమూకలకు ఆర్థికసాయం చేస్తున్నారన్న కోణంలోనూ ఎన్‌ఐఏ స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూనే వారి పనివారు చేసుకెళ్తున్నారు. నగరంలో ఉగ్రసానుభూతిపరులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై స్థానిక ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులు సంయుక్తంగా నిఘా సారిస్తున్నారు.
రోహింగ్యాల కదలికలపై ఆరా..!
ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న రోహింగ్యాలు దేశంలోని జమ్మూకాశ్మీర్, హైదరాబాద్, ఢిల్లీ , ముంబై, మేవా ట్ తదితర ప్రాంతాలలో దాదాపు 40వేల మంది శరణార్థులుగా ఉన్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదిక మేరకు ఎన్‌ఐఎ అధికారులు వారి కదలికలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రోహింగ్యాలున్నల్లున్నట్లు పోలీసు రికార్డుల ప్రకారం ఎన్‌ఐఎ వారి కదలికలపట్ల ప్రత్యేక నిఘా సారిస్తోంది. మయన్మార్ దేశం నుంచి తరమేస్తున్న రో హింగ్యా ముస్లిం తెగలతో దేశానికి ముప్పు పొంచిఉందని, వారిని ఎప్పుడైన ఇస్లామిక్ స్టేట్ వాడుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు ఆదేశాల మేరకు ఎన్‌ఐఎ వర్గాలు అప్రమత్తమైయ్యాయి. రోహింగ్యా ముస్లిం తెగకు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నయన్న కోణంలో విచారణ చేపడుతున్నా రు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని రోహింగ్యాలను గుర్తించేందుకు ఎన్‌ఐఎ కసరత్తు ప్రారంభించారు. కార్డన్ సర్చ్‌లలో రోహింగ్యాల వివరాలు సేకరించి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని పోలీసులకు ఎన్‌ఐఎ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Chhattisgarh Police Arrest SiMI Terrorist At Shamshabad Airport

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిమీ ఉగ్రవాది అజర్ రాకపై ఎన్‌ఐఎ ఆరా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.