రెండో సంతానం కోసం…సవతి కూతురిని చంపిన కసాయి తల్లి

చెన్నై: తమిళనాడులోని సెలియాపూర్‌లో ఆరేళ్ల పాపను సవతి తల్లి గొంతు పిసికి అనంతరం మూడంతస్థుల భవంతి నుంచి కింద పడేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….2015లో ప్రతిభన్ అనే వ్యక్తి శరణ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం దంపతులకు పాప జన్మించింది. పాపకు రాఘవి అనే పేరు పెట్టారు. రాఘవి చిన్నగా ఉన్నప్పుడు శరణ్య అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. సూర్యకళ అనే అమ్మాయిని ప్రతిభన్ వివాహం చేసుకన్న అనంతరం వీరికి […] The post రెండో సంతానం కోసం…సవతి కూతురిని చంపిన కసాయి తల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నై: తమిళనాడులోని సెలియాపూర్‌లో ఆరేళ్ల పాపను సవతి తల్లి గొంతు పిసికి అనంతరం మూడంతస్థుల భవంతి నుంచి కింద పడేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….2015లో ప్రతిభన్ అనే వ్యక్తి శరణ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం దంపతులకు పాప జన్మించింది. పాపకు రాఘవి అనే పేరు పెట్టారు. రాఘవి చిన్నగా ఉన్నప్పుడు శరణ్య అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. సూర్యకళ అనే అమ్మాయిని ప్రతిభన్ వివాహం చేసుకన్న అనంతరం వీరికి ఒక బాబు జన్మించడంతో సవతి కూతురిని సూర్యకళ పట్టించుకునేది కాదు.

సవతి కూతురు అమ్మమ్మ వలమర్తి కూడా వీళ్ల ఇంట్లోనే ఉండడంతో సూర్యకళకు నచ్చేది కాదు. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని రెండో సంతానం వద్దని భర్త ఆమెకు పలుమార్లు సూచించాడు. ఆమె మాత్రం రెండో సంతానం కోసం భర్తతో గొడువ పెట్టుకున్న కూడా ఆయన తిరస్కరించేవాడు. దీంతో సవతి కూతురిని చంపితే రెండో సంతానానికి భర్త ఒప్పుకోవడంతో పాటు సవతి కూతురు అమ్మమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని ప్లాన్ వేసింది. భర్త ఆఫీస్‌కు వెళ్లగానే సవతి కూతురిని గొంతు పిసికి చంపి అనంతరం మూడో అంతస్థు నుంచి ఆ బాలికను కింద పడేసింది. తన భర్తకు ఫోన్ చేసి రాఘవి కనిపించడంలేదని తెలిపింది. స్థానికంగా వెతకగా రాళ్ల మధ్యలో బాలిక మృతదేహం కనిపించిందని భర్తకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి సూర్య కళపై అనుమానం కలిగింది. వెంటనే తనదైన శైలిలో పోలీసులు ప్రశ్నించగా అసలు నిజాలు ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి సూర్యకళను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

 

 

 

The post రెండో సంతానం కోసం…సవతి కూతురిని చంపిన కసాయి తల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: