విషవలయంలో మధురఫలాలు..!

కాల్షియం కార్బైడ్ వంటి హానికర పదార్ధాల వాడకం పండ్ల పక్వానికే అదే మంత్రం తనిఖీలు పట్టని ప్రజారోగ్య మార్కెటింగ్ శాఖ ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం హాలియా: సహజ సిద్దమైన పద్దతుల్లో పండ్లను మాగబెడితే అందులోని పోషకాలు దెబ్బతినక పోవడమే కాక ఆరోగ్యకరంగానూ ఉంటాయి. కానీ..! లాభాపేక్షతో కాల్సియం కార్భైడ్, వ్యాక్స్ వంటి విషపూరిత రసాయనాల్ని పక్వానికి ఉపయోగిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న రసాయనాల్ని అరికట్టాలని హైకోర్టు ఆదేశించినా ఈ రసాయనాలు మాత్రం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా, […]

కాల్షియం కార్బైడ్ వంటి హానికర పదార్ధాల వాడకం
పండ్ల పక్వానికే అదే మంత్రం
తనిఖీలు పట్టని ప్రజారోగ్య మార్కెటింగ్ శాఖ
ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం

హాలియా: సహజ సిద్దమైన పద్దతుల్లో పండ్లను మాగబెడితే అందులోని పోషకాలు దెబ్బతినక పోవడమే కాక ఆరోగ్యకరంగానూ ఉంటాయి. కానీ..! లాభాపేక్షతో కాల్సియం కార్భైడ్, వ్యాక్స్ వంటి విషపూరిత రసాయనాల్ని పక్వానికి ఉపయోగిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న రసాయనాల్ని అరికట్టాలని హైకోర్టు ఆదేశించినా ఈ రసాయనాలు మాత్రం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హాలియా, నిడమనూరు, పెద్దవూర, త్రిపురారం వంటి మండల కేంద్రాలలో పండ్ల వ్యాపారాలు ఉన్నాయి. మామిడి, సపోట, దానిమ్మ, అరటి, కమల, ఆపిల్, పుచ్చకాయ, కర్భూజా, బొప్పాయి, ద్రాక్షపండ్లు విక్రయిస్తున్నారు. వీటిని హోల్‌సేల్ వ్యాపారులు హైద్రాబాద్‌లోని కొత్తపేట పండ్ల మార్కెట్, నాగపూర్, నాందేడ్ నుండి కొనుగోలు చేస్తారు. మండలంలోని చిరు వ్యాపారులకు ఎంత సరుకు ఎప్పుడు కావాలో ఆ మేరకు ముందే పెట్టెల్లో కార్భైడ్ పెట్టి తెల్లారి సరుకు నేరుగా రిక్షాల్లో ,ఆటోల్లో దుకాణాలకు చేరవేస్తున్నారు.

మామిడి పక్వంలో కార్భైడ్
అత్యంత రుచికరమైన పండ్లల్లో మామిడి అగ్రశ్రేణిగా చెప్పొచ్చు. మామిడి పక్వానికే కాల్షియం కార్భైడ్‌ను అత్యధికంగా వినియోగిస్తున్నారు. పక్వానికి రాకముందే కోసిన కాయలు చాలా గట్టిగా ఉంటాయి. అవి తొందరగా మెత్తబడి రంగు మారేందుకు తప్పనిసరిగా కాల్షియం కార్భైడ్‌ను వాడుతున్నారు. అక్కడి నుండి సరుకు మార్కెట్‌కు రవాణా చేసే సమయంలోనే కాయల మద్య కార్భైడ్ ప్యాకెట్లు ఉంచుతున్నారు. రంగు మారిన వెంటనే వాటిని తీసివేసి విక్రయిస్తున్నారు.

పుచ్చకాయలకు ఇంజక్షన్
పుచ్చకాయ సాగులో రసాయనాల ప్రభావం పెరిగింది. పుచ్చకాయ పాదుకు, పూతకు వచ్చాక కాయగా మారి పెద్దదయ్యేందుకు కనీసం 45 రోజులు పడుతుంది. అప్పుడే అది పక్వానికి వస్తుంది. వ్యాపారులు మాత్రం పుచ్చకాయలకు ఆక్సిటోసిన్‌అనే రసాయనాన్ని ఇంజక్షన్‌తో ఎక్కిస్తున్నారు. దీంతో కాయ 10 రోజుల లోపే పెద్దదై పండినట్లు రంగు మారుతుంది. ఈ రసాయనంతో పేగులో పుండ్లు పుడతాయి. గర్భిణులకు గర్భస్రావం అవుతుందని వైద్యులంటున్నారు. దీంతో పాటు అరటి పండు గెలలపై కాల్షియం కార్భైడ్ లేదంటే ఇథరల్ ద్రావణాన్ని నేరుగా పోస్తున్నారు. దీంతో కాయలు ఒక్క రోజుల్లోనే మెత్తబడి పసుపు రంగులోకి మారుతున్నాయి. ఇలా పండ్లపై వాక్స్ కలపడంతో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి.

మాగబెట్టే కృత్రిమ ప్రక్రియ
కాయల్ని తెంపి వాటి మద్య కాల్షియం కార్భైడ్‌ను పేపర్‌లో పొట్లాలు కట్టి ఉంచుతారు. కాల్షియం కార్భైడ్ గాలిలో తేమతో కలిసినప్పుడు ఎసిటలీస్ వాయువు వెలువడుతుంది. దీనిలో ఫాస్పీన్, ఆర్సిన్ అనే రసాయనాలుంటాయి. కాయల మధ్య కార్భైడ్ ఉంచడంతో వెలువడే ఎసిటిలీస్ కాయల తొక్కలపైకి వెళ్లి అవి మెత్తబడేలా చేస్తుంది.

తనిఖీలు చేపట్టని ప్రజా ఆరోగ్యశాఖ
ఇంతటి ప్రాణాంతకమైన రసాయనాలను వాడుతున్నప్పటికీ ప్రజారోగ్యశాఖ, మార్కెటింగ్‌శాఖల అధికారులు తనిఖీలు చేపట్టిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. కేన్సర్లు అల్సర్లు వస్తాయి.(వైద్యులు డాక్టర్ నులక.రవీందర్‌రెడ్డి ఎం.డి. ఆదిత్యకేర్ హాలియా). కాల్షియం కార్భైడ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్యులు డాక్టర్ రవీందర్‌రెడ్డి పేర్కొంటున్నారు. పండ్ల పక్వానికి ఉపయోగించే కాల్షియం కార్భైడ్ వల్ల మనిషికి కేన్సర్, అల్సర్ వచ్చే ప్రమాదముందని పేర్కొంటున్నారు.

Chemical used to ripen mangoes can cause cancer 

 

Related Stories: