పంజా విసురుతున్న చిరుత…

  * నిద్రావస్థలో అటవీశాఖ * రైతులపై దాడులు * భయాందోళనలో ప్రజలు * రోడ్డుపైకి వన్యప్రాణులు మెదక్ : వన్యప్రాణులు జనజీవన స్రవంతికి చేరుకుంటున్నాయి. అధికారులు లక్షలు పెట్టి ఎండను తట్టుకోవడానికి సాసర్లతోపాటు వన్యప్రాణులు నీరు తాగడానికి ఖర్చు చేస్తామని చెబుతున్న అవికాగితాలకే పరిమితమవుతున్నాయి. దాహాం కోసం ఇటీవల జింక బోధన్-/మెదక్ రహదారిపైకి వచ్చి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనానికి ఢీకోని మృతిచెందిన విధితమే. తూతూమంత్రంగా రెండు,మూడు ట్యాంకర్లు అటవీప్రాంతంలోకి తరలించి నీరుపోస్తున్నామని చేతులు దులుపుకుంటున్నారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన […] The post పంజా విసురుతున్న చిరుత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

* నిద్రావస్థలో అటవీశాఖ
* రైతులపై దాడులు
* భయాందోళనలో ప్రజలు
* రోడ్డుపైకి వన్యప్రాణులు

మెదక్ : వన్యప్రాణులు జనజీవన స్రవంతికి చేరుకుంటున్నాయి. అధికారులు లక్షలు పెట్టి ఎండను తట్టుకోవడానికి సాసర్లతోపాటు వన్యప్రాణులు నీరు తాగడానికి ఖర్చు చేస్తామని చెబుతున్న అవికాగితాలకే పరిమితమవుతున్నాయి. దాహాం కోసం ఇటీవల జింక బోధన్-/మెదక్ రహదారిపైకి వచ్చి ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనానికి ఢీకోని మృతిచెందిన విధితమే. తూతూమంత్రంగా రెండు,మూడు ట్యాంకర్లు అటవీప్రాంతంలోకి తరలించి నీరుపోస్తున్నామని చేతులు దులుపుకుంటున్నారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు వాటి హక్కులను భంగపరుస్తున్నారు. మే 1న రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన పిట్ల లచ్చయ్య పొలం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లగా ఆకస్మత్తుగా చిరుతపులి దాడిలో రైతు రక్తసిక్తమై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. లచ్చయ్యను మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఎఫ్‌ఓ పద్మజారాణి రైతును ఓదార్చి ఆర్థికంగా ఆదుకుంటామని హామిఇచ్చి వెళ్లిన అనంతరం మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామానికి చెందిన జెట్టి భూషణంకు చెందిన లేగదూడ చిరుతపులి దాడిలో వ్యవసాయ బావి వద్ద చిరుత దాడి చేయడంతో మృతిచెందింది. ఏప్రిల్ అదే గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు చెందిన లేగదూడలపై చిరుత దాడి చేసి మూడు లేగదూడల ప్రాణాలను బలిగొంది. గంగాపూర్ గ్రామంలో ఉదయం రాములుకు చెందిన దూడను సైతం చిరుత దాడిచేయడంతో మృతిచెందింది. చిరుత దాడుల వల్ల లేగదూడలు మృతిచెందుతున్నాయి. వాటితోపాటు పొలాల వద్దకు వెళ్లిన రైతులను సైతం వదలకుండా చిరుతపులి దాడులు చేస్తుంది. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో చిరుతపులి కోసం అటవీశాఖ అధికారులు గంగాపూర్, శమ్నాపూర్,లకా్ష్మపూర్, నాగాపూర్, తిమ్మాయిపల్లి గ్రామాల్లో మూడురోజులపాటు గాలింపులు చేసిన ఫలితం లేకుండా పోయింది. అనంతరం కామారెడ్డి జిల్లా వదలపర్తి గ్రామంలో పంట పొలంలో విద్యుత్‌తీగకు షాక్ తగిలి చిరుత మృతిచెందిందని అటవీశాఖ అధికారులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఎండ తీవ్రతతో అడవుల్లోనుంచి జనజీవన స్రవంతిలోకి చిరుతలు వస్తున్నట్లు సమాచారం. మెదక్/రామాయంపేట రహదారివెంట ద్విచక్రవాహనదారులు వెళ్లాలంటే జంకుతున్నారు. గతంలో కొల్చారం మండలం మంజీర పరివాహక ప్రాంతంలో చిరుత సంచరిస్తుందని తెలుపగా హైదరాబాద్‌కు చెందిన జూపార్క్ ఎఫ్‌ఆర్‌వో మురళిధర్‌రావు వలపన్ని పట్టుకుని జూపార్క్‌కు తరలించారు. ఈ విషయమై డిఎఫ్‌ఓ పద్మజారాణిని వివరణకోరగా మెదక్ అటవీప్రాంతంలో ఆరునుంచి 8 వరకు చిరుతపులులు ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అటవీప్రాంతంలోని గ్రామాల ప్రజలు పశువులను ఆరుబయట కాకుండా పశువుల పాకలోనే ఉంచాలని వివరించారు. రాత్రి వేళల్లో అటవీశాఖకు చెందిన ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు తిరుగుతున్నాయని వివరించారు.

Cheetah attack on farmers

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పంజా విసురుతున్న చిరుత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.