అంగట్లో సరుకుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు!

  బహదూర్‌పల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తానంటూ వ్యక్తి డబ్బులు వసూల్ అప్రమత్తమైన టిఆర్‌ఎస్ నాయకులు… దళారిని పట్టుకుని దుండిగల్ పోలీసులకు అప్పగింత కుత్బుల్లాపూర్ : పేదల సొంతింటి కళ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో దళారులకు వరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు అంగట్లో సరుకుగా మారింది. నిరుపేదలకు ఇళ్ల ఆశను చూపి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు […] The post అంగట్లో సరుకుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బహదూర్‌పల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తానంటూ వ్యక్తి డబ్బులు వసూల్
అప్రమత్తమైన టిఆర్‌ఎస్ నాయకులు… దళారిని పట్టుకుని దుండిగల్ పోలీసులకు అప్పగింత

కుత్బుల్లాపూర్ : పేదల సొంతింటి కళ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌లో దళారులకు వరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపు అంగట్లో సరుకుగా మారింది. నిరుపేదలకు ఇళ్ల ఆశను చూపి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తానంటు డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఓ వ్యక్తిని బహదూర్‌పల్లి టిఆర్‌ఎస్ నాయకులు పట్టుకున్నారు. బాధితుల సమాచారం మేరకు అతన్ని నిలదీసిన నాయకులు వసూల్ చేసిన నగదును తిరిగి బాధిత ప్రజలకు ఇప్పించి వసూల్ రాయుడిని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజికవర్గం దుండిగల్ మున్పిపాలిటీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ ఇళ్లు ఉట్టిమీద కుండలా మారింది. ఇళ్ల ఆశను చూపి వసూల్ రాయుళ్ల అవతారం ఎత్తిన కొందరు దళారులు స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా బహదూర్‌పల్లి గ్రామంలో నివాసం ఉండే టైలర్ సుధాకర్ తనకు తెలుసని వారి నుంచి డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఇద్దరి నుంచి 20 వేలు చొప్పున 40 వేల రూపాయలు వసూల్ చేశాడు.

ఈ విషయం బాధిత మహిళల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక టిఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలిచారు. మరికొంత మందికి ఇళ్లు కావాలంటూ దళారిని రప్పించిన నాయకులు వసూల్ రాయుడు సుధాకర్‌ను పట్టుకున్నారు. ప్రభుత్వ నిరుపేదల కోసం కట్టిస్తున్న ఇళ్లును నువ్వు ఎలా మంజూరు చేయిస్తావో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో నిజం అంగీకరించిన దళారి సుధాకర్ తీసుకున్న 40వేల రూపాయలను బాధితులకు అందజేసినట్లు నాయకులు టిఆర్‌ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తెలిపారు.

నిందితుడి వెనుకాల ఎవరి హస్తం ఉందో పోలీసులు తెల్చాలి : మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్
తెలంగాణ సిఎం కేసిఆర్ నిరుపేదల కోసం కట్టించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అంగట్లో సరుకుగా మార్చిన నిందితుడిని సరైన పద్ధతిలో దర్యాప్త్తు చేపట్టాలని టిఆర్‌ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ దుండిగల్ పోలీసులను కోరారు. ఇళ్లు కేటాయిస్తామని వసూళ్లకు పాల్పడిన సుధాకర్‌ను దుండిగల్ పోలీసులకు అప్పగించిన నాయకులు అతని వెనుకాల ఎవరూ ఉన్నారు? ఇలా ఎంత మంది వద్ద డబ్బులు వసూల్ చేశారు ?అనేది దర్యాప్తు తేల్చి భాదితులకు అండగా ఉండి న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. నిరుపేదల పక్షాన టిఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపిన ఆయన పేదలకు ప్రభుత్వ ఫలాలు అందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

తానుకూడా మోసపోయానంటున్న దళారి సుధాకర్
ఇళ్లు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూల్ చేసి నాయకులు పట్టుకోవడంతో తిరిగి నగదును ఇచ్చేసిన దళారి సుధాకర్ తానుకూడా గుర్తుతెలియని వ్యక్తి మాటలు నమ్మిమోసపోయానని తెలిపాడు. తను కూడా అందరి లాగే డబ్బులు చెల్లించానని వివరణ ఇచ్చాడు. అయితే ఎవరికి డుబ్బలు ఇచ్చావ్?తీసుకున్న వ్యక్తి ఎవరూ ఎక్కడ ఉంటాడు ఇళ్లు ఎలా ఇప్పిస్తావ్ అని నాయకులు స్థానికులు ప్రశ్నిస్తే మాత్రం తనకు ఏమి తెలియదని డబ్బులు తీసుకుంటున్న ప్రధాన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలియదని తెలపడం పలు అనుమానాలకు తావునిస్తుందంటున్నారు. బాధిత ప్రజలు అతన్ని అదుపులోకి తీసుకున్న దుండిగల్ పోలీసులు అతని వెనుకాల ఎవరు ఉన్నారో తేల్చి మరోసారి ఇటువంటి వసూల్ రాయుళ్లు పేదల జోలికి వెళ్లకుండా చేయాలని పోలీసులను టిఆర్‌ఎస్ శ్రేణులు కోరుతున్నారు.

Cheating in the name of double bedroom houses

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అంగట్లో సరుకుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: