‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్ర్కిప్ట్‌ లీక్‌…పోలీసులను ఆశ్రయించిన ఛార్మీ

  హైదరాబాద్‌: ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు విడుదలకు ముందే భారీ షాక్ తగిలింది. ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం లీక్ కావడంతో పోలీసుల్ని ఆశ్రయించింది చిత్ర యూనిట్. దీంతో సోషల్ మీడియాలో సినిమా స్ర్కిప్ట్‌ లీక్‌ చేశారంటూ చిత్ర సహ నిర్మాత ఛార్మి కౌర్ సైబరాబాద్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ కు చెందిన ముర‌ళీ కృష్ణ అనే వ్య‌క్తి ‘ఇస్మార్ట్ శంకర్’ కథ […] The post ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్ర్కిప్ట్‌ లీక్‌… పోలీసులను ఆశ్రయించిన ఛార్మీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు విడుదలకు ముందే భారీ షాక్ తగిలింది. ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం లీక్ కావడంతో పోలీసుల్ని ఆశ్రయించింది చిత్ర యూనిట్. దీంతో సోషల్ మీడియాలో సినిమా స్ర్కిప్ట్‌ లీక్‌ చేశారంటూ చిత్ర సహ నిర్మాత ఛార్మి కౌర్ సైబరాబాద్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ కు చెందిన ముర‌ళీ కృష్ణ అనే వ్య‌క్తి ‘ఇస్మార్ట్ శంకర్’ కథ స్క్రిప్ట్ మొత్తం ‘బ‌జ్ బాస్కెట్‌’ ఇన్‌స్టాగ్రామ్ గ్రూపులో లీక్‌ చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఛార్మీ కోరారు. స్క్రిప్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించేందుకు సదరు వ్యక్తి భారీగా డబ్బు డిమాండ్ చేశాడట. అడిగిన డబ్బు ఇవ్వకపోతే స్క్రిప్ట్‌ మొత్తాన్ని అన్ని సామాజిక మాధ్యమాల వేదికల్లోనూ షేర్‌ చేస్తానని బెదిరించడంతో చిత్రయూనిట్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Charmi files Complaints on Ismart Shankar script leaked

The post ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ స్ర్కిప్ట్‌ లీక్‌… పోలీసులను ఆశ్రయించిన ఛార్మీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: