విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో క్రేజీ మూవీ

 

హైదరాబాద్: రాక్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది నటి ఛార్మీ కౌర్. తన మాస్ డైలాగులతో పాటు హీరోలను హై రేంజ్ లో చూపించే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత పూరి ఎవరితో సినిమా చేస్తాడోనని పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండతో పూరి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల్లో టాక్.

 తాజాగా దీనిపై ఛార్మీ క్లారిటీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పూరీ, విజయ్, ఛార్మీ కలిసి దిగిన ఫోటోను ట్వీట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ మూవీపై మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని చార్మి ట్వీట్ చేసింది. ఈ సినిమాను ఛార్మీతో కలిసి పూరి సొంత నిర్మాణంలో తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ కోసం పూరి ఓ వినూత్న పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

 Charmi announces Puri, Vijay Devarakonda movie

The post విజయ్ దేవరకొండ, పూరి కాంబోలో క్రేజీ మూవీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.