జిహెచ్‌ఎంసి నూతన చట్టం…మార్చినాటికి సిద్దం

KTR

 

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ చట్టం సమూల మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగర పౌరులకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలందించడమే లక్షంగా పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు మార్గదర్శనంలో ఈ చట్టానికి రూప కల్పన చేస్తున్నారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసికి సంబంధించి ప్రత్యేక చట్టం అమల్లో ఉండడం, ఈ చట్ట ప్రకారమే పాలక మండలి, అధికారులు తమ తమ విధులను నిర్వహిస్తున్నారు.అయితే ఇప్పటీకే ప్రభుత్వం కొత్తగా పురపాలక చట్టం తీసుకువచ్చినప్పటికీ ఇది జిహెచ్‌ఎంసి వర్తింప జేసే అవకాశం లేకపోవడంతో, ప్రస్తుతం చట్టాన్ని సమూలంగా మార్పులు చేర్పులకు అవసరమైన ప్రక్రియకు అధికారులు సిద్దం అవుతున్నారు.

ఈ నూతన జిహెచ్‌ఎంసి చట్టంలో కొత్తగా తీసుకువచ్చిన పురపాలక చట్టంలోని అన్ని కీలక అంశాలను పొందపర్చనున్నారు. ఈ చట్టాన్ని మార్చిలో జరగనున్న రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నాటికి సిద్దం చేయడం, ఈ సెషన్‌లోనే సభా ఆమోదానికి పంపించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమైయ్యారు. ఇందుకు సంబంధించి శనివారం పురపాలక, ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు జిహెచ్‌ఎంసి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించడమే కాకుండా నూతన చట్టం రూపకల్పనకు దిశ నిర్ధేశం చేశారు. దాదాపుగా పురపాలక చట్టంలోని నిబంధనలను యథాతధంగా జిహెచ్‌ఎంసి నూతన చట్టంలో పొందపర్చాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ జిహెచ్‌ఎంసి అధికారులను అదేశించారు.

చట్టంలో పొందపర్చనున్న ముఖ్యమైన అంశాలు:

1. పౌరులకు మరింత వేగవంతంగా పారదర్శకంగా సేవలు అందించడం.
2. ప్రతినిధులపై బాధ్యత పెంచడం.
3. తమ విధుల పట్ల మరింత బాధ్యత వహించేలా చూడడం.
4. చేయని ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు.
5. నిర్మాణ అనుమతుల ప్రక్రియ మరింత సులభతరం.
6. నూతన తెలంగాణ బిల్డింగ్ అనుమతుల ప్రక్రియ(టిఎస్‌బిపాస్)అమలు
7. నిర్మాణాలకు సంబంధించి హెచ్‌ఎండిఎలోనూ మార్పులు.
8. ప్రక్రియలకు అనుగుణంగా చట్టంలో అవసరమైన మార్పులు చేర్పులు .
9. చట్టంలోని నిబంధనలన్ని జిహెచ్‌ఎంసి చట్టంలో యథాతధం.
10. పనులు, గ్రీనరీ పెంపుకు ప్రత్యేక ప్రాధాన్యత.

Changes to the GHMC Act by March, says KTR

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జిహెచ్‌ఎంసి నూతన చట్టం… మార్చినాటికి సిద్దం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.