విఆర్‌ఒ పరీక్ష కేంద్రాల్లో స్వల్ప మార్పులు…

హైదరాబాద్:  విలేజ్ రెవిన్యూ ఆఫీసర్(విఆర్‌ఒ) పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,945 కేంద్రాలలో జరుగనున్న విఆర్‌ఒ పరీక్షకు 10,58,868 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. సరూర్‌నగర్‌కు కేటాయించిన మూడు పరీక్ష కేంద్రాలను దిల్‌సుఖ్‌నగర్‌కు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించిన వివరాలను అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇక పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుంది. దీని కోసం హైదరాబాద్ […]

హైదరాబాద్:  విలేజ్ రెవిన్యూ ఆఫీసర్(విఆర్‌ఒ) పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,945 కేంద్రాలలో జరుగనున్న విఆర్‌ఒ పరీక్షకు 10,58,868 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అయితే, నగరంలోని కొన్ని పరీక్ష కేంద్రాల్లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. సరూర్‌నగర్‌కు కేటాయించిన మూడు పరీక్ష కేంద్రాలను దిల్‌సుఖ్‌నగర్‌కు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించిన వివరాలను అభ్యర్థులు టిఎస్‌పిఎస్‌సి వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇక పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుంది. దీని కోసం హైదరాబాద్ జిల్లాలో 237 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 99,485 మంది అభ్యర్థులు విఆర్‌ఒ పరీక్ష రాయనున్నారు.

Comments

comments

Related Stories: