ఎంసెట్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

TS EAMCET

 

మే 4,5,7,8 తేదీల్లో ఇంజినీరింగ్
5న ఉదయం పూటే, ఫార్మా తేదీల్లో మార్పలేదు
27న లా, పిజిఎల్‌సెట్లు, 28-31 వరకు పిజిఇసెట్

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్ సహా మరో రెండు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్వల్ప మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 5,6,7 తేదీలలో జరగాల్సిన ఇంజనీరింగ్ ఎంసెట్‌ను మే 4,5,7,8 తేదీలలో నిర్వహించనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సెట్ కన్వీనర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

మే 5వ తేదీన మాత్రం ఉదయం సెషన్ మాత్రమే పరీక్షలు జరుగనుండగా, మిగతా తేదీలలో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లు పరీక్షలు జరుగనున్నాయి. ఫార్మా ఎంసెట్ మాత్రం యథావిధిగా మే 9,11 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. అలాగే మే 25వ తేదీన జరగాల్సిన లాసెట్, పిజిఎల్‌సెట్ మే 27న జరుగనుండగా, మే 27 నుంచి 30 వరకు జరగాల్సిన పిజిఇసెట్ పరీక్షలు మే 28 నుంచి 31 వరకు జరుగనున్నాయి.

Changes in TS EAMCET Exam Dates

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎంసెట్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.