న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి…

  సోమాజిగూడ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా న్యాయ వ్యవస్థ చట్టాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోకపోవడంతో బాదితులకు సరైన న్యాయం జరగడం లేదని హైకోర్టు సిీనియర్ న్యాయవాది గోపాల కృష్ణ కళానిధి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం పలువురు బాధితుల తో కలసి పలు కేసులలో బాధితులు చట్ట పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం అనే అంశంపై ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల దురాగతాలు, సరైన సమయంలో పోలీసులు అభియోగ […] The post న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సోమాజిగూడ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా న్యాయ వ్యవస్థ చట్టాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోకపోవడంతో బాదితులకు సరైన న్యాయం జరగడం లేదని హైకోర్టు సిీనియర్ న్యాయవాది గోపాల కృష్ణ కళానిధి ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం పలువురు బాధితుల తో కలసి పలు కేసులలో బాధితులు చట్ట పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం అనే అంశంపై ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసుల దురాగతాలు, సరైన సమయంలో పోలీసులు అభియోగ ప్రతాలను నమోదు చేయకపోవడం, కోర్టులలో కాలయాపన, బాదితులకు, న్యాయవాదులకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకుని మేధావులతో పాటు విద్యావేత్తల తో కమిటిని ఏర్పాటు చేసి ఏళ్ళ నాటి చట్టాలలో తీసుకురావాల్సిన మార్పులపై లోతైన అద్యయనం చేయాలని డిమాండ్ చేశారు. బాదితులు చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం దశాబ్ద కాలం పాటు కోర్టుల చూట్టు తిరుగుతు ఆర్ధికంగా, మానసికంగా ఎంతో ఆవేదనను అనుభివించాల్సిన పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. సమస్యకు పరిష్కారం దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Changes in the judicial system

Related Images:

[See image gallery at manatelangana.news]

The post న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: