మూడో రోజూ కొచ్చర్‌ను విచారించిన ఇడి

  న్యూఢిల్లీ : వరుసగా మూడో రోజు ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట విచారణకు హాజరయ్యారు. వీడియోకాన్‌కు రుణాల మంజూరులో మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో వీరిని ఇడి ప్రశ్నిస్తోంది. గత సోమవారం నుంచి న్యూఢిల్లీలోని ఏజెన్సీ క్వార్టర్స్ వద్ద ఇడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇడి కార్యాలయానికి చేరుకున్న కొచ్చర్ దంపతులను అధికారులు విచారించారు. కాగా గతంలో […] The post మూడో రోజూ కొచ్చర్‌ను విచారించిన ఇడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ : వరుసగా మూడో రోజు ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట విచారణకు హాజరయ్యారు. వీడియోకాన్‌కు రుణాల మంజూరులో మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో వీరిని ఇడి ప్రశ్నిస్తోంది. గత సోమవారం నుంచి న్యూఢిల్లీలోని ఏజెన్సీ క్వార్టర్స్ వద్ద ఇడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇడి కార్యాలయానికి చేరుకున్న కొచ్చర్ దంపతులను అధికారులు విచారించారు. కాగా గతంలో ఈ కేసుకు సంబంధించి ముంబై, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో సోదాలు నిర్వహించి, అనంతరం ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో వారిని విచారించారు. వీడియోకాన్ గ్రూప్ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్ గత ఏడాది అక్టోబరులో ఐసిఐసిఐ బ్యాంకు సిఇఒ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్ రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందారనే ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Chanda Kochhar, husband appear before ED again in ICICI

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడో రోజూ కొచ్చర్‌ను విచారించిన ఇడి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: