చామగడ్డ…పోషకాల అడ్డా

  దుంపకూరల్లో చామగడ్డకి ప్రత్యేక స్థానం ఉంది. చామగడ్డ పులుసు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంట్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అవేంటో చూద్దాం… * చామగడ్డలు జిగురుగా, శుభ్రం చేసి ఉడకబెట్టి తినాలా అని బద్ధకించి తినకుండా వాటికి దూరంగా ఉండకూడదు. నేడు బాధ పడుతున్న అనేక రుగ్మతలకు చక్కని ఔషధంలా పనిచేసే ఆహారమిది. అధిక శరీర బరువును నిరోధించాలంటే వీటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. చామగడ్డల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండడమే […] The post చామగడ్డ… పోషకాల అడ్డా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దుంపకూరల్లో చామగడ్డకి ప్రత్యేక స్థానం ఉంది. చామగడ్డ పులుసు ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంట్లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అవేంటో చూద్దాం…
* చామగడ్డలు జిగురుగా, శుభ్రం చేసి ఉడకబెట్టి తినాలా అని బద్ధకించి తినకుండా వాటికి దూరంగా ఉండకూడదు. నేడు బాధ పడుతున్న అనేక రుగ్మతలకు చక్కని ఔషధంలా పనిచేసే ఆహారమిది. అధిక శరీర బరువును నిరోధించాలంటే వీటికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. చామగడ్డల్లో కొవ్వు శాతం తక్కువగా ఉండడమే కాకుండా సోడియం శాతం కూడా తక్కువే. ఈ ఆహారం నిదానంగా జీర్ణం అవుతూ నెమ్మదిగా శరీరానికి శక్తినిస్తుంది. కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. గుండె జబ్బులు రాకుండా చేస్తూ, రక్త ప్రసరణను మెరుగుపరిచి హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది.

* చామగడ్డలో విటమిన్- ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి లతోపాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్.. వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పీచు ఎక్కువగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు చేమదుంపలను నిరంభ్యతరంగా తీసుకోవచ్చు. అనేక చర్మవ్యాధులను నివారిస్తుంది. ఎముకల పటిష్టతకు దోహదం చేస్తుంది. దృష్టి లోపాలను దూరం చేస్తుంది. అధిక పీచు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యేన్సర్‌ల నుంచి కాపాడడమే కాకుండా క్యేన్సర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచి ఆహారం.

Chamagadda is rich in Nutrients

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చామగడ్డ… పోషకాల అడ్డా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: